
సాక్షి, లక్డీకాపూల్: సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం.. స్వర్గమవ్వాలి వనవాసం’ పాట గుర్తొస్తుంది. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ చిత్రం ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా ‘కమనీయమైన.. రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అంటూ సాగే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు) కంపోజ్ చేశారు.
ప్యాషన్ ఫర్ క్రైస్ట్ – జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రాణం’ కమలాకర్ మాట్లాడుతూ– ‘‘క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్ ఉండేలా రెండు పాటలను కంపోజ్ చేశామన్నారు. ‘కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా..’ అనే పాట ఏడు భాషల్లో విడుదలైందన్నారు జోష్వా షేక్ లిరిక్స్ అందించారు. ‘రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అనే పాటను కూడా అతనే రాసినట్లు తెలిపారు. మధురై, కేరళ నుంచి రిథమ్ సెక్షన్, కేరళ నుంచి కొరియోగ్రాఫర్స్‌ను పిలిపించి రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment