kamalakar
-
హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం!
హోలీ పండుగవేళ.. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలోని వార్దా తీరం కన్నీటి మయమైంది. ఆర్తనాదాలతో మారుమోగింది. అప్పటి వరకు ఉత్సాహంగా రంగుల పండుగ జరుపుకుని స్నానం కోసం వెళ్లిన నలుగురు స్నేహితులను నది పొట్టన బెట్టుకుంది. ఈత రాకపోవడంతో గల్లంతై తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఆ మిత్రుల చివరి వేడుక విషాదాంతంగా మారింది. నాలుగు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగి ల్చింది. విగత జీవులుగా మిగిలిన బిడ్డలను పట్టుకొని గుండెలవిసేలా ఆ తల్లులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఉత్సాహంగా హోలీ చేసుకుని.. కౌటాల మండలం కేంద్రంలోని నదిమాబాద్‌కు చెందిన పనస కమలాకర్(22), ఆలం సాయి(22), ఉప్పుల సంతోష్(25), ఎల్ములె ప్రవీణ్(23), మేడి నవీన్, పసుల సంతోష్ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. కలిసి చదువుకోకున్నా ఒకే కాలనీలో ఉండడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. సోమవారం హోలీ పండుగ కలిసే జరుపుకున్నారు. మధ్యాహ్న వరకు రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు దిగారు. తర్వాత మద్యం కొనుగోలు చేసి స్నానాలు చేసేందుకు తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దా నది వద్దకు వెళ్లారు. మద్యం తాగి స్నానానికి దిగి.. ఆరుగురూ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. తర్వాత ఒడ్డునే కూర్చుని అందరూ వెంటతెచ్చుకున్న మద్యం సేవించారు. అనంతరం నవీన్ అక్కడి నుంచి కౌటాలకు తిరిగి వెళ్లాడు. పసుల సంతోష్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఒడ్డునే ఉండి పోయాడు. కమలాకర్, ఉప్పుల సంతోష్, ప్రవీణ్, సాయి మాత్రం మరోసారి స్నానం చేసేందుకు నదిలో దిగారు. మద్యం మత్తు, ఈత రాకపోవడం, లోతు అంచనా వేయకపోవడంతో నలుగు రూ గల్లంతయ్యారు. గమనించిన సంతోష్ సమీ పంలో ఉన్నవారి వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరాడు. స్థానికులు నదిలో గాలించగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో కౌటాల సీఐ సాదిక్‌పాషా, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గజ ఈతగాళ్లను రప్పించి సుమారు నాలుగు గంటలపాటు గాలించారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణాలివే.. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృత్యువాత పడడానికి ప్రధాన కారణం ఈత రాకపోవడం. నదిలో లోతు అంచనా వేయకుండా స్నానానికి వెళ్లడం, మద్యం తాగి ఉండడం అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో నది ప్రవాహం వంపు తిరిగి ఉంది. నదిలో స్నానానికి వెళ్లిన ప్రదేశంలో తీరం నుంచి ఇసుక ఉండగా.. నడుచుకుంటూ వెళ్లిన వారు ఒక్కసారిగా లోతుకు పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు. మద్యం తాగి ఉండటం, నీటి మట్టం కారణంగా బయట రాలేకపోయారని పోలీసులు పేర్కొన్నారు. యువకులు దిగే చోట లోతు ఎక్కువగా ఉందని స్థానిక రైతులు చెప్పినా లెక్క చేయకపోవడంతో అంతా విగతజీవులుగా మారాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ తాటిపల్లి వద్ద ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మరో యువకుడు పసుల సంతోష్‌తో మాట్లాడారు. సీఐ సాదిక్ పాషాతో మాట్లాడిన ఎస్పీ మృతదేహాలకు త్వరగా పోస్ట్‌మార్టం ముగించి కుటుంబీకులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. యువకులు నలుగురు మద్యం తాగి నీటిలోకి దిగడంతో ఈత రాక మృతి చెందారని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. మిన్నంటిన రోదనలు.. యువకులు నీటిలో గల్లంతయిన విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ప్రజలు భారీగా నది వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను వెలుపలికి తీయగానే మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘హోలీ ఆడి ఇంటికి వచ్చి బోర్ వేసుకుని స్నానం చేయమన్నా కదా కొడుకా.. ఇక్కడికి ఎందుకు వచ్చినవ్ కొడుకా..’ అంటూ కమలాకర్ తల్లి నది వద్ద కొడుకు మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కదిలించింది. మృతుల వివరాలు.. ఆలం శంకర్–దేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, సాయి పెద్ద కుమారుడు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉప్పుల గురుపాదం–శంకరమ్మ దంపతుల చిన్న కుమారుడు ఉప్పుల సంతోష్. తండ్రి గతంలో చనిపోవడంతో ఇంటర్ పూర్తి చేసిన సంతోష్ రైస్‌మిల్లులో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. పనస వసంత్ – లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పేద కుటుంబం కావడంతో పెద్ద కుమారుడు కమలాకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. వాసుదేవ్ – సునీత దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎల్ములే ప్రవీణ్. వీరిది రైతు కు టుంబం. ప్రవీణ్ వ్యవసాయంలో తండ్రికి తోడుగా ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం వివా హం కాగా, భార్య వకుళ, ఏడాది వయసున్న కుమారుడు వేదాంశ్ ఉన్నాడు. కొడుకు మృతితో భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం ప్రవీణ్ మేనమామ చౌదరి మారుతి కూడా సిర్పూర్(టి) మండలం టోంకిని వద్ద వార్దా నదిలోనే గల్లంతై మృతి చెందాడు. ఇవి చదవండి: వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య.. -
అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన కమలాకర్‌తో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామానికి చెందిన పద్మ(22)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు వారి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చజెప్పారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్య పద్మను కమలాకర్ వేదించడంతో రెండు రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున పద్మ ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమాములు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కమలాకర్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ ఎం.రమేశ్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించారు. ఆందోళనకు దిగిన పద్మ బంధువులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పద్మ తండ్రి దుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ఇవి కూడా చదవండి: లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం! -
యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి...
సిర్పూర్ (టి): అతడికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమకు నిరాకరించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెకు పురుగుల మందు తాగించి పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఓ పదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బుదే దీప (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్‌బాయిల కుమారుడు కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కమలాకర్ ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న ఆదివారం సాయంత్రం యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్నీ చంపుతానని దీపను బెదిరించాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. దీప కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిని మొదట సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో కాగజ్‌నగర్‌కు.. అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌కు తరలించారు. సోమవారం కరీంనగర్లో దీప మృతి చెందింది. దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే దీపకు కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగించిన విషయం ఓ పదేళ్ల చిన్నారి ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై రమేశ్ వారికి నచ్చజెప్పారు. పోలీసులు ఆస్పత్రిలోనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
Karimnagar: అద్భుతం.. ఆకర్షణీయం
ఎప్పుడెపుడా అంటూ ఎదురుచూస్తున్న తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. వాస్తవానికి గత ఏప్రిల్ 14న వంతెన ప్రారంభించాలి. కానీ.. పనులు పూర్తికాకపోవడం.. ఓ సభలో మంత్రి కాలికి గాయంకావడం తదితర కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ.. పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండురోజుల పాటు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. #KarimNagar Cable Bridge 🌉. pic.twitter.com/MJgXbQHadO — Aravind Alishetty (@aravindalishety) June 16, 2023 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యాటకంలో కలికితురాయిగా నిలి చే కేబుల్ బ్రిడ్జిని తొలుత నగరవాసులకు పరిచయం చేయాలని మంత్రి కమలాకర్ నిర్ణయించారు. స్థాని కులు వంతెనపై తిరిగేందుకు వీలుగా ప్రతీ ఆదివా రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. పర్యాటకులను రంజింపజేసేలా మ్యాజిక్ షో, మ్యూజిక్ షో, కళకారుల ఆటాపాటలు తదితర వినోద కార్యక్రమాలు సిద్ధంచేశారు. రకరకాల ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయనున్నారు.దసరా వరకు కు టుంబాలతో వచ్చి సరదాగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. వంతెన వద్ద కొరియా సాంకేతికతతో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నేపథ్యమిదీ.. వరంగల్ – కరీంనగర్ నగరాల మధ్య దాదాపు 7. కి.మీల దూరం తగ్గించడం, హైదరాబాద్–కరీంనగర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది. 2018లో రూ.180 కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన తర్వాత తెలంగాణలో రెండో బ్రిడ్జి కరీంనగర్‌దే కావడం విశేషం. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో వంతెనను నిర్మించారు. రేపటి నుంచి కార్పొరేషన్ పరిధిలోకి.. వంతెన నిర్వహణ బాధ్యతలు గురువారం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్(ఎంసీకే) చేతుల్లోకి వెళ్లనుంది. వంతెనపై లైటింగ్, పారిశుధ్యం నిర్వహణ, విద్యుత్ తదితరాలు ఇకపై బల్దియా చూసుకుంటుంది. రెండేళ్లపాటు వంతెనకు సంబంధించిన సాంకేతికపరమైన నిర్వహణను మాత్రం ఆర్ అండ్ బీ అధికారులు చూస్తారు. వంతెనపై రెండు భారీ పిల్లర్ల అంచున నాలుగు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ప్రభుత్వ, ప్రైవేటు ప్రకటనలు ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చే యాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. అధికా రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్రిడ్జి విశేషాలు.. 500 మీటర్ల పొడవైన రోడ్డు, ఫోర్‌లేన్ ఇటలీ నుంచి తెప్పించిన 26 పొడవైన స్టీల్ కేబుల్స్ వంతెనకు రెండు పైలాన్లు.. వీటి మధ్యదూరం 220 మీటర్లుపైలాన్ నుంచి ఇంటర్ మీడియన్‌కు దూరం 110 మీటర్లు రూ.180 కోట్ల బడ్జెట్.. పూర్తిగా అధునాతన ఇంజినీరింగ్ వ్యవస్థ రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్వెడల్పు 21.5 మీటర్లు, ఒక్కోటి 7 మీటర్ల వెడల్పుతో రెండు దారులు రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణం 2017 డిసెంబర్లో నిర్మాణానికి శంకుస్థాపన 2018 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం 2023 జనవరి 26న వంతెనపై పనుల కోసం వాహనాలకు అనుమతి2023 జూన్ 21న వంతెన ప్రారంభం పర్యాటక కేంద్రంగా.. కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని టూరిజం స్పాట్‌గా నిలపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్లో భాగంగానే తీగల వంతెన ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఆయనకు కరీంనగర్ మీద ఉన్న మమకారం అలాంటిది. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి, రూ.410 కోట్లు వెచ్చించి మానేరు పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మానేరు రివర్ ఫ్రంట్(ఎంఆర్ఎఫ్) ప్రాజెక్టును మంజూరుచేశారు. – మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ పర్యటన ఇలా.. కేబుల్ బ్రిడ్జితోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న మున్సిపల్, ఐటీ మినిస్టర్ కె.తారకరామారావు బుధవారం సాయంత్రం 5 గంటలకు రూ.10 కోట్లతో కశ్మీర్గడ్డలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 5.05 గంటలకు రూ.7 కోట్లు వెచ్చించి నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐసీసీ వీడియో వాల్ కంట్రోల్ రూం, 14 జంక్షన్ల ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం (ఏటీసీఎస్), 18 చోట్ల ఏర్పాటు చేసిన పబ్లిక్ అండ్రసింగ్ సిస్టం(పీఏఎస్), 8 చోట్ల వేరియబుల్ మెసేజింగ్ సిస్టం, ఐదుచోట్ల వాతావరణ సూచికలు, 18 ప్రాంతాల్లో వైఫై హాట్స్పాట్లు, ఘన వ్యర్థాల నిర్వహణను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు కమాన్‌మీదుగా ఓపెన్‌టాప్ జీపులో ర్యాలీగా వెళ్లి కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన డైనిమిక్ లైటింగ్ సిస్టమ్‌కు స్విచ్ఛాన్ చేయనున్నారు. -
బండి సంజయ్.. నీకు దమ్ముంటే ఆయనపై గెలువు చూద్దాం..!!
-
ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హిప్నో కమలాకర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్. ఈయనకు కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్ ఉన్నారు. స్వగ్రామం రాజమండ్రి సమీపంలోని నాగుల్లంక కాగా, 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా.. ‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ -
‘ప్రాణం’ కమలాకర్ పాట ఏడు భాషల్లో..
సాక్షి, లక్డీకాపూల్: సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్ పేరు చెప్పగానే ‘ప్రాణం’ సినిమాలోని ‘నిండు నూరేళ్ల సావాసం.. స్వర్గమవ్వాలి వనవాసం’ పాట గుర్తొస్తుంది. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ చిత్రం ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కమలాకర్ క్రిస్మస్ కానుకగా ‘కమనీయమైన.. రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అంటూ సాగే రెండు గాస్పల్ సాంగ్స్ (సువార్త పాటలు) కంపోజ్ చేశారు. ప్యాషన్ ఫర్ క్రైస్ట్ – జోష్వాషేక్ యూట్యూబ్ ఛానెల్లో విడుదలైన ఈ పాటలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రాణం’ కమలాకర్ మాట్లాడుతూ– ‘‘క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంగీత దర్శకత్వంలో డివోషనల్ టచ్ ఉండేలా రెండు పాటలను కంపోజ్ చేశామన్నారు. ‘కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా..’ అనే పాట ఏడు భాషల్లో విడుదలైందన్నారు జోష్వా షేక్ లిరిక్స్ అందించారు. ‘రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్..’ అనే పాటను కూడా అతనే రాసినట్లు తెలిపారు. మధురై, కేరళ నుంచి రిథమ్ సెక్షన్, కేరళ నుంచి కొరియోగ్రాఫర్స్‌ను పిలిపించి రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు. -
ఆ ఆలోచన నాకు లేదు
‘‘ముప్పై ఏళ్లుగా ఆర్.డి. బర్మన్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకూ చాలామంది సంగీతదర్శకులతో పనిచేశా. ఇప్పుడు కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న రజనీకాంత్ ‘2.0’ చిత్రానికి సంగీతం బృందంలో చేస్తున్నా. అనుభవం ఉన్న సంగీతదర్శకుల దగ్గర పని చేయడం వల్లే సంగీతదర్శకుడిగా నేనెక్కువ సినిమాలు చేయలేకపోయా’’ అన్నారు ‘ప్రాణం’ కమలాకర్. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వరాలు అందించిన కమలాకర్ మాట్లాడుతూ –‘‘రామ్మోహన్‌గారు ‘పిట్టగోడ’కు సంగీతం అందించమన్నప్పుడు మాంటేజ్ సాంగ్స్ షూట్ చూసి, పాటలకు ప్రాధాన్యం ఉందనిపించి ఒప్పుకున్నా. నేను సినిమాలకు సంగీతం అందించడం మానలేదు. మానేయాలనే ఆలోచనా లేదు. ఇప్పుడు కొన్ని చిత్రాలకు సంగీతం ఒకరు, నేపథ్య సంగీతం మరొకరు అందిస్తున్నారు. అది నాకిష్టం ఉండదు. అందుకే ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం రెండూ నేనే అందించా’’ అన్నారు. -
డబ్బు కోసం రోగిని చంపేశాడు
కమలాకర్ ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ కంబాలచెరువు (రాజమహేం ద్రవరం) : ఆపరేషన్ చేస్తే చనిపోతుందని తెలిసి కూడా.. డబ్బుకు కక్కుర్తి పడి వివాహిత మృతికి ఆస్పత్రి వైద్యుడు కారకుడయ్యాడంటూ మృతురాలి బంధువులు స్థానిక దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జొన్నాడకు చెందిన మార్తమ్మ(28) ఆరోగ్యం బాగోక కడియం మండలం బుర్రిలంకలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వారు ఆమెను బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉందని, దానిని ఎంవీఆర్గా నిర్ధారించారు. ఆపరేషన్ చేయకూడదని మందులిచ్చి పంపేశారు. తర్వాత వారు దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుడు కట్టా కమలాకర్ ఆమెను పరీక్షించి, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని, రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అదీ ఆరోగ్యశ్రీ ద్వారా వస్తుందనడంతో, ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. ఈ నెల 6న ఆపరేషన్ చేయగా, రెండు రోజులైనా రోగి వద్దకు ఎవరినీ అనుమతించలేదు. సోమవారం ఆమె మృతిచెందిందని తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి వైద్యుడిని నిలదీశారు. ఆపరేషన్ సమయంలో మార్తమ్మ సహకరించలేదని, దీంతో కొన్ని వైర్లు ఊడిపోయాయని, యూరిన్ ఆగిపోవడంతో ఆమె చనిపోయిందని తెలిపారు. ‘ఆపరేషన్ చేసినా బతకలేదు.. మేమేం చేస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు వాపోయారు. కేవలం ఆరోగ్యశ్రీ డబ్బులకు కక్కుర్తిపడి, రోగి మృతికి కారకులయ్యారంటూ కడియం సర్పంచ్ ఓరా రాము పోలీసులకు వివరించారు. మృతురాలి ముగ్గురు పిల్లలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఫిర్యాదుచేస్తే విచారణ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. -
మాకు ‘అమ్మ’ పాట వదిలి తను వెళ్లిపోయాడు : బూచేపల్లి వెంకాయమ్మ
‘‘మా సంస్థలో నిర్మించిన ఐదో చిత్రం ఇది. ఇందులో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ‘అమ్మ’ పాట చాలా హృద్యంగా ఉంటుంది. మా అబ్బాయి ఆ పాట మాకు వదిలి తను తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’ అని బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. కమలాకర్ హీరోగా చింతలపూడి వెంకట్ దర్శకత్వంలో బూచేపల్లి వెంకాయమ్మ సమర్పణలో బి. నాగలక్ష్మి నిర్మించిన ‘బ్యాండు బాలు’ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమలాకర్ తల్లి వెంకాయమ్మ తన కొడుకుని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో ‘అమ్మ...’ మీద ఉన్న పాటను తన గుర్తుగా మాకు వదిలేసి, తను వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. కమలాకర్ పిల్లల కోసం తాము బతుకుతున్నామనీ, లేకపోతే తను వెళ్లిపోయినప్పుడే మేమూ... అంటూ దుఃఖంతో మాట్లాడలేకపోయారు. కమలాకర్ తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘2012లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, పది నెలల్లో పూర్తి చేశాం. విడుదలకు సిద్ధం చేస్తున్న సమయంలో కమలాకర్ మరణం మమ్మల్ని కలిచివేసింది. ఆ మానసిక క్షోభ కారణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు కొంచెం తేరుకున్నాం. సెంటిమెంట్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సినిమా మీద మమకారంతో లాభాలను బేరీజు వేసుకోకుండా కమలాకర్ సినిమాలు తీసి, పది మందికి ఉపాధి కల్పించాడని నటుడు చలపతిరావు చెప్పారు. దర్శకుడు చింతలపూడి వెంకట్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ మీద ఒక పాట ఉంది. ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో వెంకాయమ్మగారు షూటింగ్‌కి వస్తే, ఆవిడ కూడా ఉంటే బాగుంటుందన్నాను. కానీ, కమలాకర్ వద్దన్నాడు. చివరికి ఆయన భార్య, ‘అమ్మ పాటే కదా.. ఉంటే బాగుంటుంది’ అనడంతో కమలాకర్ అంగీకరించాడు. ఈ విధంగా ఈ పాటలో ఆమె ఉన్నారు. ‘ప్రతి తల్లికీ ఈ పాట మంచి బహుమతి’ అని కమలాకర్ అనేవారు. అంత గొప్పగా ఉంటుంది’’ అన్నారు. కమలాకర్ సోదరుడు శివప్రసాద్‌రెడ్డి, నటులు బెనర్జీ, శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. -
సీఐ వేధింపులు భరించలేకపోతున్నా
ఆత్మకూరు : ఆత్మకూరు సీఐ కిషోర్‌కుమార్ తనను విపరీతంగా వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు భరించలేకపోతున్నానని ఒగ్లాపూర్ ఎంపీటీసీ సభ్యుడు నేరెళ్ల కమలాకర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ముస్త్యాలపల్లి సర్పంచ్‌గా పనిచేశానని, అలాగే ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఎంపీటీసీగా గెలిపించారని అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలో తనను ఎంపీపీగా గెలవకుండా సీఐ కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయూరు. సీఐ మిత్రుడు బొల్లం లక్ష్మణ్, సీఐతో ప్రాణ భయముందని ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేదని, తాను భయాందోళనకు గురవుతున్నానని, అవసరమైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే గ్రామంలో తన భూములు, ఇల్లు అమ్ముకొని వెళ్తానని అన్నారు. ఎంపీటీసీ ఆరోపణలు అవాస్తవం : సీఐ కిషోర్‌కుమార్ ఈ విషయమై సీఐ కిషోర్‌కుమార్‌ను వివరణ కోరగా తనపై ఒగ్లాపూర్ ఎంపీటీసీ కమలాకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒక ప్రజాప్రతినిధిని స్టేషన్‌కు పిలిపించి వేధించాననడం సమంజసం కాదన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించాననడం కూడా అవాస్తవమేనని కొట్టిపారేశారు. -
విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి
శ్రీకాకుళం: రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. మంగళవారం జాక్టో నేతలు కమలాకర్, వీరబ్రహ్మం, కొండయ్య, నాగేంద్రరావు, శౌరీ రాయులు, నారాయణ, రమేష్‌బాబు, యోగేశ్వరుడు, రమణయ్య తదితరులు ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని విడదీసిన తరువాత అనేక కొత్త సమస్యలు తలెత్తాయని వారు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పాఠశాల పనివేళలను మార్చడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాతపద్ధతిలోనే వేళలను అమలు చేయాలన్నారు. -
జోరందుకున్న కారు
కరీంనగర్ కార్పొరేషన్ : మరో 24 గంటల్లో మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఏకంగా ఆ పార్టీ మేయర్ అభ్యర్థే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వలసలు ఆపేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో కార్పొరేటర్లు చేజారుతూనే ఉన్నారు. అందరూ గులాబీ చెంతన చేరుతుండడంతో బల్దియాలో కారు జోరందుకుంది. కరీంనగర్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ఇప్పటికే పూర్తి మెజారిటీ సాధించి న టీఆర్ఎస్లో తాజాగా మరో ఐదుగురు కార్పొరేటర్లు చేరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత మేయర్ అభ్యర్థి 34వ డివిజన్ కార్పొరేటర్ వావిలాల హన్మంతరెడ్డి, అదే పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్, స్వతంత్రులుగా గెలిచిన 11వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్, 37వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వానా బేగం-సలీంఖాన్, 49వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ అధినేత సమక్షంలో గులాబీదళంలో చేరారు. మాజీ కార్పొరేటర్ బీర్పూర్ నాగేశ్వర్ సైతం గులాబీ గూటికే వెళ్లారు. ప్రతిపక్షమనేదే లేకుండా పదవులన్నీ ఏకగ్రీవం చేసుకుని, అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేసిన ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. మున్సిపల్లో 50 మంది కార్పొరేటర్లకు గాను 24 మంది టీఆర్ఎస్ వాళ్లు గెలుపొందగా, 14 మంది కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ఇద్దరు ఎంఐఎం, టీడీపీ ఒకరు, మిగతా ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌నుంచి ఐదుగురు టీఆర్ఎస్ బాట పట్టడంతో ఆ పార్టీ బలం 14 నుంచి 9కి పడిపోయింది. ఇంకా వలసలున్నాయని ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీలో మిగిలేవారెందరనే ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థులిద్దరూ... కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలుగా వెలుగొంది, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా బరిలో దిగిన వై.సునీల్‌రావు, వావిలాల హన్మంతరెడ్డి ఇద్దరూ పార్టీకి చేయిచ్చారు. నిన్న మొన్నటి వరకు మేయర్ బరిలో తామున్నామంటూ మెజారిటీ సీట్లు గెలుచుకోకున్నా.. చాపకింద నీరులా పావులు కదుపుతూ.. టీఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టించిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. మొన్న సునీల్‌రావుతోపాటు గూడూరి శారద, గంట కళ్యాణి, నేడు వావిలాల హన్మంతరెడ్డితో మెండి శ్రీలత-చంద్రశేఖర్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ భారీ నష్టాన్నే చవిచూస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచే మేయర్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉండి, అదే స్థాయిలో పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషిచేసిన నేతలిద్దరూ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో బల్దియాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. వీరిని బుజ్జగించేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు చేసి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడంతో నేతలంతా తమ భవిష్యత్ కోసం పార్టీని వీడి అధికార పార్టీ పంచన చేరుతున్నారు. పార్టీనుంచి గెలిచిన 14 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే ఐదుగురు టీఆర్ఎస్లో చేరడం, వలసలు ఇంకా ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
బాబు హయాంలో తెలంగాణ ఎడారి
కరీంనగర్: టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆరోపించారు. కులవృత్తులను నాశనం చేసిన ఘనత చంద్రబాబుదేనని కమలాకర్ అన్నారు. అదే చంద్రబాబు నేడు బీసీ సీఎం నినాదం అంటూ సరికొత్త కుయుక్తులతో వస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లేనని కమలాకర్ సూచించారు. -
‘తెలంగాణ’ సంబురం
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణవాదులు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీజేఏసీ, టీఎస్జేఏసీలతోపాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ వేడుక జరుపుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆనందంతో నృత్యాలు చేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల పోరాటాన్ని గౌరవిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి, ఎంపీ ఇళ్ల ముందు సంబరాలు తెలంగాణనోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించడం పట్ల మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇళ్ల ముందు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచాపేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సునీల్‌రావు, అంజన్‌కుమార్, కర్ర రాజశేఖర్, కన్నకృష్ణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మహేష్, సరిళ్ల ప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, పడిశెట్టి భూమయ్య, మీస బీరయ్య, గంట శ్రీనివాస్, పొన్నం సత్యం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో... టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో అమరులకు నివాళులర్పించారు. గుగ్గిళ్లపు రమేష్, ఎడ్ల అశోక్, గుంజపడుగు హరిప్రసాద్, మైఖేల్ శ్రీనివాస్, అనంతుల రమేష్, పెండ్యాల మహేష్, బండ గోపాల్‌రెడ్డి, పొన్నం అనిల్, కాటం సురేష్, దాది సుదాకర్, అప్జల్ జుబేర్, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి, ప్రిన్స్ రాజు, చంద్రం, రమేష్, ప్రదీప్, సుదర్శన్ పాల్గొన్నారు. తెలంగాణ చౌక్‌లో... కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జీఎస్.ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొల్లం లింగమూర్తి, పల్లె నారాయణగౌడ్, కొట్టె కిరణ్‌కుమార్, మధుసూదన్, సందీప్‌కుమార్, పూసాల సంపత్‌కుమార్, నీలి నర్సయ్య, సతీష్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మీస అరుజన్రావు, పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, టవర్‌సర్కిల్