హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణవాదులు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీజేఏసీ, టీఎస్‌జేఏసీలతోపాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ వేడుక జరుపుకున్నారు.
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదించడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆనందంతో నృత్యాలు చేశారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల పోరాటాన్ని గౌరవిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంత్రి, ఎంపీ ఇళ్ల ముందు సంబరాలు
తెలంగాణనోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించడం పట్ల మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇళ్ల ముందు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచాపేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సునీల్‌రావు, అంజన్‌కుమార్, కర్ర రాజశేఖర్, కన్నకృష్ణ, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గందె మహేష్, సరిళ్ల ప్రసాద్, గుగ్గిళ్ల జయశ్రీ, పడిశెట్టి భూమయ్య, మీస బీరయ్య, గంట శ్రీనివాస్, పొన్నం సత్యం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో...
టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో అమరులకు నివాళులర్పించారు. గుగ్గిళ్లపు రమేష్, ఎడ్ల అశోక్, గుంజపడుగు హరిప్రసాద్, మైఖేల్ శ్రీనివాస్, అనంతుల రమేష్, పెండ్యాల మహేష్, బండ గోపాల్‌రెడ్డి, పొన్నం అనిల్, కాటం సురేష్, దాది సుదాకర్, అప్జల్ జుబేర్, శ్రీకాంత్, రవీందర్‌రెడ్డి, ప్రిన్స్ రాజు, చంద్రం, రమేష్, ప్రదీప్, సుదర్శన్ పాల్గొన్నారు.
తెలంగాణ చౌక్‌లో...
కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జీఎస్.ఆనంద్ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొల్లం లింగమూర్తి, పల్లె నారాయణగౌడ్, కొట్టె కిరణ్‌కుమార్, మధుసూదన్, సందీప్‌కుమార్, పూసాల సంపత్‌కుమార్, నీలి నర్సయ్య, సతీష్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో
బీజేపీ నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మీస అరుజన్‌రావు, పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు.
- న్యూస్‌లైన్, టవర్‌సర్కిల్
‘తెలంగాణ’ సంబురం
Published Fri, Oct 4 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement