హైదరాబాద్: ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
హిప్నో కమలాకర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్. ఈయనకు కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్ ఉన్నారు. స్వగ్రామం రాజమండ్రి సమీపంలోని నాగుల్లంక కాగా, 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
చదవండి:
తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా..
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’
Comments
Please login to add a commentAdd a comment