విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి | given request to CM on problems of education department | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి

Published Wed, Aug 20 2014 3:27 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి - Sakshi

విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతి

శ్రీకాకుళం: రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. మంగళవారం జాక్టో నేతలు కమలాకర్, వీరబ్రహ్మం, కొండయ్య, నాగేంద్రరావు, శౌరీ రాయులు, నారాయణ, రమేష్‌బాబు, యోగేశ్వరుడు, రమణయ్య తదితరులు ముఖ్యమంత్రిని కలిసి  సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని విడదీసిన తరువాత అనేక కొత్త సమస్యలు తలెత్తాయని వారు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేయాలని కోరారు. పాఠశాల పనివేళలను మార్చడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాతపద్ధతిలోనే వేళలను అమలు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement