'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి | Communist Party of India state secretary Narayana takes on State Government | Sakshi

'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి

Dec 26 2013 12:45 PM | Updated on Nov 9 2018 5:52 PM

'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి - Sakshi

'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి

బస్సు మాఫియా, ఫిష్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.

బస్సు మాఫియా, ఫిష్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆపార్టీ కేంద్ర నాయకుడు బర్థన్తోపాటు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బూర్జువా పార్టీలు తమ విధానాన్ని మార్చుకున్నాయని వెల్లడించారు.

 

రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని జోస్యం చెప్పారు. అనంతరం ఆ సభలో బర్ధన్ మాట్లాడుతూ... కమ్యూనిస్టులు చీలిపోయినా అందరి లక్ష్యం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష లౌకికశక్తులు.. ఒకే వేదికపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని బర్ధన్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement