state secretary
-
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ
సాక్షి, సంగారెడ్డి: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ నియమితులయ్యారు. 60 మందితో సీపీఎం నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటి నుంచి ఉద్వాసన పలికారు. తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావులకు సీపీఎం రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.అయితే, సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఆ కమిటీ ఎన్నుకోనుంది. -
వైఎస్సార్సీపీలో రెండు నియామకాలకు వైఎస్ జగన్ ఆదేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు కీలక పదవులకు కార్యదర్శి, అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు. చదవండి: కరెంట్ ఛార్జీలతో ప్రజల నెత్తిన మరో పిడుగు: కాకాణి గోవర్ధన్ రెడ్డి -
TN: ఎస్జీ సూర్య అరెస్ట్
చెనై: జాబ్ రాకెట్ కుంభకోణంలో డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేయడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. బాలాజీ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాజకీయంగా ఎదుర్కోలేక.. త్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. మంత్రి అరెస్ట్ అనంతరం బీజేపీపై కౌంటర్ అటాక్‌కు దిగారు సీఎం స్టాలిన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జీ సూర్యను మదురై పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(a), 505 (1)(b), 505 (1)(c).. ఐటీ చట్టం 66(d) ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు అతన్ని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా మధురై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఎం) ఎంపీ సు వెంకటేశన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఎస్జీ సూర్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అధికారుల మాత్రం బీజేపీ నేత అరెస్టుకు గల సరైన కారణాన్ని వెల్లడించలేదు. విశ్వనాథన్ అనే కమ్యూనిస్ట్ కౌన్సిలర్ మలంతో నిండిన కాలువను శుభ్రం చేయమని పారిశుధ్య కార్మికుడిని బలవంతం చేశారని, ఫలితంగా అలెర్జీ కారణంగా కార్మికుడు మరణించాడని సూర్య ఆరోపించారు. ఈ మేరకు ఈ సంఘటనను తీవ్రంగా విమర్శిస్తూ ఎంపీ వెంకటేశన్‌కు రాసిన లేఖ రాశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘మీ వేర్పాటువాద రాజకీయాలు ఆ మురికి గుంట కంటే హీనంగా కంపు కొడుతున్నాయి. మనిషిగా బ్రతకడానికి మార్గం కనుక్కోండి మిత్రమా’ అంటూ విశ్వనాథన్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సూర్యను అరెస్ట్ చేసినట్లు సమాచారం చదవండి: బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం సూర్య అరెస్ట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జి సూర్యను రాత్రికి రాత్రే అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది చట్ట విరుద్ధమన, సామాజిక సమస్యలపై డీఎంకే దాని కూటమి పార్టీ కమ్యూనిస్టు ద్వంద్వ వైఖరిని విమర్శించినందుకే అతన్ని అరెస్టు చేశారంటూ ట్విటర్లో ఆరోపించారు. తమ విమర్శలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి వారి గొంతులను మూయించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారిని అరెస్ట్ చేసే అప్రజాస్వామిక ధోరణి రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విమర్శలను ఎదుర్కోలేక బీజేపీ కార్యకర్తలను నిరంతరం అరెస్టు చేయడం నిరంకుశ పోకడకు నిదర్శనం. ఇలాంటి అణచివేతలతో కాషాయ శ్రేణులు వెనక్కి తగ్గరు. ప్రజల కోసం మా గొంతు ఎప్పుడూ ధైర్యంగా మోగుతుంది. ప్రశ్నించే గొంతులన్నింటినీ అణచివేయడానికి ప్రయత్నిస్తే ఎక్కువకాలం ప్రజాస్వామ్యంలో కొనసాగలేరనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి’ అని అన్నామలై ట్విటర్లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే నేత, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ ఇటీవల అరెస్ట్ చేసిన మూడు రోజులకే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు కొద్ది రోజుల కిందట కరోనా సోకడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. మోహన్ మృతి పట్ల ఎంపీలు అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంతాపం తెలిపారు. ఇవీ చదవండి: రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు -
‘తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలమైన శక్తి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. బర్కత్‌పుర కేశవ నిలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని రమేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 1600 క్లస్టర్లు ఉన్నాయని.. అన్ని క్లస్టర్లకు ఆర్ఎస్ఎస్ చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు. భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. దీనికి ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో పాటు, వక్తగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని రమేష్ తెలిపారు. 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్కి హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట -
దొంగ ఎవరో ప్రజలకు తెలుసు
బద్వేలు: వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు, ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంలో టీడీపీదే ప్రధాన పాత్ర అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, పోరుమామిళ్ల జెడ్పీటీసీ శారదమ్మ పేర్కొన్నారు. గురువారం కవలకుంట్ల పంచాయతీ పరిధిలోని బూత్ నంబర్లు 44, 45, 46 కన్వీనర్లు, సభ్యులతో సమావేశమయ్యారు. ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నాగార్జునరెడ్డి సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు అబద్ధాలతో పాలన చేస్తున్నారని, ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఓట్లు తొలగించి గెలుపొందేందుకు తప్పుడు మార్గాల్లో టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపులో దొంగలెవ్వరో ప్రజలందరికీ తెలసని అన్నారు. నిష్పాక్షపాతంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ఓటర్లు సైతం తమ పేరు ఓటరుజాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్వకేట్ ప్రభాకరరావు, పీరయ్య, సుబ్బరాయుడు, ఏసురత్నం, రామయ్య, బాబు, సుబ్బానాయుడు, తిరుపతయ్య, మద్దయ్య, శేషయ్య, వెంకటరమణ, రమణయ్య నారాయణ, పిచ్చయ్య పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చల్లా మధుసూదన్‌రెడ్డిని ఈ పదవిలో నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
చందాలు దండుకునేందుకే మినీ మహానాడ
కొవ్వూరు : కొవ్వూరులో నిర్వహించిన టీడీపీ జిల్లా మినీ మహానాడు పేరుతో మంత్రి, నాయకులు భారీగా వ్యాపారుల నుంచి చందాలు దండుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నుంచి కిరాణా వర్తకుల వరకు చందాలు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం మూలంగానే కొవ్వూరులో పెట్టిన జిల్లా మినీమహానాడు పూర్తిగా విఫలమైందన్నారు. నసమీకరణ కోసం ఉపాధి హామీ కూలీలకు మస్తర్ వేసి సభకు తరలించడం ఎంతవరకు సమజసం అని ప్రశ్నించారు. జిల్లాలో సమస్యలను గాలికి వదిలేసి మహానాడులో కేవలం ప్రతిపక్షంపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. చాగల్లు మండల పార్టీ అధ్యక్షుడు కోఠారు అశోక్‌బాబా, దళిత విభాగం రాష్ట్ర విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు, మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాల మురళీకృష్ణ (చిన్నారి), నాయకులు గారపాటి వెంకటకృష్ణ, ఉప్పులూరి సూరిబాబు, కొఠారు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీరివ్వలేరా?
బాలయ్య తీరు దారుణం ఎంపీ నిమ్మల, మున్సిపల్ చైర్పర్సన్ పట్టించుకోరు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, విపక్ష నేతలు హిందూపురం అర్బన్ : ప్రజలకు గుక్కెడు తాగునీరు ఇవ్వలేని చేతకాని పాలకులు ఉన్నారంటే సిగ్గుచేటని సామాజిక హక్కుల రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించాలంటూ సోమవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఆందోళన చేశారు. స్థానిక రహమత్‌పురం నుంచి ఖాళీ బిందెలతో ర్యాలీగా తరలివచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ అధ్యక్షతన «బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలో 35 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలే పాలిస్తున్నా నీటి సమస్యకు శాశ్విత పరిష్కరం చూపకపోవడం దారుణమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు నియోజకవర్గానికి వచ్చే తీరికలేదు..ఎంపీ నిమ్మలకిష్టప్ప అసలు ఇటు వైపు కన్నెత్తి చూడరు..స్థానికంగా ఉండే చైర్పర్సన్ కమీషన్ల కోసం కమిషనర్‌తో గొడవలు పడటానికే సరిపోయిందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరునెలలుగా కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారంటే ఎంత సిగ్గుచేటన్నారు. సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ మండుతున్న ఎండలో వందలాది మంది ప్రజలు ఖాళీ బిందెలతో మున్సిపల్ ఆఫీసు వద్దకు వస్తే అడిగేవారే లేకపోవడం దారుణమన్నారు. అధికారులు, పాలకులపై ప్రజలు తిరగబడే పరిస్థతి వచ్చిందన్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు ఎదుట మట్టికుండలు పగులగొట్టి నినాదాలు చేశారు. డీఈ వన్నూరప్పకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇందాద్, బీఎస్పీ శ్రీరాములు, ఓపీడీఆర్ శ్రీనివాసులు, సీపీఐ నాయకులు సురేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదా సాధనలో చంద్రబాబు విఫలం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు ప్రత్యేకహోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. సోమవారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ, టీడీపీలు డ్రామా ఆడయాన్నారు. రాజ్యసభ సభ్యుడిగా వేరే రాష్ట్రానికి పోయినంత మాత్రాన మీరు రాష్ట్రవాసి కాకపోరు కదా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చినా చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు సిగ్గురాలేదన్నారు. అదిగో..ఇదిగో ప్రత్యేక హోదా అని రెండున్నర ఏళ్లుగా ప్రచారం చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పుడు మాట మార్చితే జనం హర్షించరన్నారు. ఓర్వకల్లు దగ్గర 30 వేల ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఏడాది క్రితం శిలాఫలకం వేశారని, ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. రాష్ట్రానికి హోదా లేకుంటే ఏ పరిశ్రమ రాదని చెప్పారు. తనకు తానుగా నీతిమంతుడిని నని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నట్లని ప్రశ్నించారు. దీనిపై ఎక్కడ తనను నిలదీస్తారోనని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. బాబు పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారంతా ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగరాజు యాదవ్, అశోక్, ప్రహ్లాదాచారి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు
ముకరంపుర: ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రతిపక్షాలను భయపెట్టి బ్లాక్మెయిల్ పాలన సాగించాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ అన్నారు. గురువారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ జాగీరు కాదని విమర్శించారు. కేసీఆర్ తమ్మిడిశెట్టి, మేడిగడ్డ బ్యారేజీల ఎత్తు తగ్గిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎత్తు తగ్గిస్తే అంచనాలు తగ్గాల్సి ఉన్నా వేల కోట్ల రూపాయలు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదివరకే మార్చి 8న, తర్వాత ఆగస్టు 23న రెండుసార్లు మహారాష్ట్ర ఒప్పందంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లకు జాతీయహోదా కల్పించడంలో నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు ఎంత డబ్బు వెచ్చిస్తున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేణుమాధవ్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మోకెనపల్లి రాజమ్మ, జిల్లా అధ్యక్షురాలు బోగెపద్మ, నాయకుడు బలాల పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ‘సాయి’
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తుల సాయి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఈ నియామకం జరిగింది. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన సాయి పార్టీలో ముమ్మిడివరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఆ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా మాత్రమే ఉన్న సాయి సేవలను ఇక ముందు రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నారు. అదే ఉద్దేశంతో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సాయికి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. జగన్మోహన్రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన రాష్ట్ర స్థాయి బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సాయి ‘సాక్షి’కి చెప్పారు. నియోజకవర్గ నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. -
ధనిక రాష్ట్రంలో పేదలపై చార్జీల మోతా?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బి.సంజీవరావు జోగిపేట : ధనిక రాష్ర్టంలో ఆర్టీసీ బస్సు, విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపుతారా? అని వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు ప్రశ్నించారు. సోమవారం జోగిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్నప్పటికీ ప్రజలపై చార్జీల మోత సరికాదన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శించి ప్రస్తుతం విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఎ మ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా? అని ప్ర శ్నించారు. ఆర్టీసీ నష్టాన్ని పూడ్చేం దుకు ఎన్నో మార్గాలున్నప్పటికీ ప్రజ లపై భారం మోపి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాని కి 9 గంటలు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించా రు. పంట లు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయడంలో ప్రభుత్వం కాలయాపన చే స్తోందన్నారు. నష్టపోయిన రైతుల జాబితాను అధికారులు ఏడాది క్రితమే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపినా ఇప్పటి వరకు ఒక్క రూ పాయి కూడా పంపిణీ చేయలేదన్నారు. రైతు రుణమాఫీని బ్యాంకర్లు వడ్డీ కిందనే జమ చేసుకుంటారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు రుణమాఫీ అమలు కావడంలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ని యోజకవర్గంలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. వైఎస్సా ర్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు డీజీమల్లయ్య యాదవ్, వైఎస్సార్ సీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్, నాయకులు ఆశయ్య, పరిపూర్ణ ఆయన వెంట ఉన్నారు. -
చంద్రబాబు గురించి మాట్లాడకపోతే పొరపాటే..
-
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ
విజయవాడ: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కె.రామకృష్ణ గురువారమిక్కడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు రోజులుగా జరుగుతున్న పార్టీ రాష్ట్ర 25వ మహాసభలో ప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని గురువారం రాత్రి పొద్దుపోయాక ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికైన తొలి కార్యవర్గం ఇది. రాష్ట్ర విభజనతోపాటే పార్టీకీ రెండు శాఖలు ఏర్పాటైన నేపథ్యంలో గతేడాది జూన్‌లో కె.రామకృష్ణ లాంఛనంగా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మహాసభలో ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. వచ్చే మూడేళ్లకాలానికి ఈ కొత్త కార్యవర్గం బాధ్యతలు నిర్వహిస్తుంది. 96 మందితో రాష్ట్ర సమితి, పది మంది ప్రత్యామ్నాయ సభ్యులు, ఆరుగురితో కంట్రోల్ కమిషన్, 29 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. కాగా రాష్ట్ర కార్యదర్శి సహా తొమ్మిది మందితో కార్యదర్శివర్గం ఎంపికైంది. ఇందులో ముప్పాళ్ల నాగేశ్వరరావు(గుంటూరు), జేవీ సత్యనారాయణమూర్తి(విశాఖ)లు సహాయ కార్యదర్శులు కాగా.. పీజే చంద్రశేఖరరావు(ప్రకాశం), జెల్లి విల్సన్(కృష్ణా), రావుల వెంకయ్య(స్టేట్ సెంటర్-రైతు సంఘం), జి.ఓబులేసు(ఏఐటీయూసీ-ప్రజా సంఘాలు), ఈడ్పుగంటి నాగేశ్వరరావు(కృష్ణా జిల్లా), బి.హరనాథ్‌రెడ్డి(చిత్తూరు జిల్లా)లు కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. -
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ తమ్మినేని!
సాక్షి, హైదరాబాద్: రాబోయే మూడేళ్లకు సీపీఎం తెలంగాణ రాష్ర్ట కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పునర్నియామకం లాంఛ నం కానుంది. పార్టీ రాష్ట్ర తొలి మహాసభల్లో భాగంగా బుధవారం ఆయన పేరును ప్రకటించనున్నారు. దాదాపు 60 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటుకానుంది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఏడుగురు సభ్యులుండగా.. ఇప్పుడది 14కు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పుడు గత ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ర్ట కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం నియమితులయ్యారు. కొత్త కమిటీ ఏర్పడి ఏడాది మాత్రమే అయినందున దాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు రాష్ర్టంలో జరిగిన పరిణామాలు, పార్టీ పరిస్థితిపై ప్రస్తుత రాష్ర్ట కమిటీ బుధవారం చివరిసారి సమావేశమై చర్చించనుంది. ఈ సందర్భంగా వెల్లడైన అభిప్రాయాలపై తమ్మినేని సమాధానమిస్తారు. ఆ తర్వాత కొత్త కమిటీ, కారదర్శివర్గం ఎన్నిక, కొత్త కార్యదర్శి ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత మహాసభల ముగింపు సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంట లకు నిజాం కాలేజీ మైదానంలో జరగనున్న బహిరంగ సభలోనూ పార్టీ నేతలంతా ప్రసంగించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నిజాం కాలేజీ వరకు ‘ఎర్రసేన కవాతు’ కార్యక్రమం ఉంటుంది. కాగా, తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల ద్వారా పార్టీ బలపడిందని ఈ మహాసభల్లో సీపీఎం నాయకత్వం అభిప్రాయపడింది. మహాసభల నేపథ్యంలో చేపట్టిన ఇంటింటికి సీపీఎం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అంచనా వేసింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిల్లో కూడా ప్రతి ఏటా నిర్వహించాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలో విద్య, వైద్య రంగాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహాసభలో తీర్మానించారు. ఈ రంగాల పరిరక్షణకు మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. -
'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి'
-
'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి
బస్సు మాఫియా, ఫిష్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆపార్టీ కేంద్ర నాయకుడు బర్థన్తోపాటు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బూర్జువా పార్టీలు తమ విధానాన్ని మార్చుకున్నాయని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని జోస్యం చెప్పారు. అనంతరం ఆ సభలో బర్ధన్ మాట్లాడుతూ... కమ్యూనిస్టులు చీలిపోయినా అందరి లక్ష్యం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష లౌకికశక్తులు.. ఒకే వేదికపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని బర్ధన్ ఆరోపించారు.