కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అటవీ ప్రాంతాల్లో చేపట్టే పనులకు ఆ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇంజినీరింగ్ శా ఖల ద్వారా చేపడుతున్న పనుల ఫొటోలు వెంట తీసుకురావాలని చెప్పినా ఎందుకు తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సర్వేయర్ల కొరత ఉందని, ఇతర జిల్లాల నుంచి డెప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఎ వరూ ముందుకు రావడం లేదని తెలిపారు.
జేసీ, అదనపు జేసీ పోస్టులు ఖాళీగా ఉండడంతో భూ సేకరణ ఫైళ్ల పరిష్కారానికి ఆటంకం కలుగుతోందని చెప్పా రు. కమ్యూనిటీ సర్వేయర్ల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. ఆరు విడతలుగా చేపట్టిన భూ పంపిణీలో కొందరు లబ్ధిదారులకు భూములు చూపలేదని, ఆయూ భూములను ఆర్డీవోలు పరిశీలించాలని ఆదేశించారు. భూ సేకరణకు ప్రైవేట్ భూములు సేకరిస్తే నిధులు ముందుగానే సమకూర్చాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్‌ఎస్.రాజు, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు, చక్రధర్, ల్యాండ్ సర్వే ఏడీ ఇనేశ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్ అండ్ ఆర్‌పై సమీక్ష..
రీ హ్యాబిటేషన్, రీ సెటిల్‌మెంట్‌పై కలెక్టర్ అహ్మద్ బాబు మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముం పునకు గురైన బాధితులకు నష్టపరిహారం పంపిణీ తీరును అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల మం డలం గుడిపేట, రాపల్లి, నంనూర్ ముంపు బాధితులకు పరిహారం పంపిణీపై ఆరా తీశారు. గుడిపేట, రాపల్లి బాధితులకు పరిహారం చెల్లించామని, నంనూర్ బాధితుల్లో కొందరికి చెల్లించాల్సి ఉందని అధికారులు బదులిచ్చారు. గుడిపేట బాధితులకు పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మిగి లిన బాధితులందరికీ త్వరగా పరిహారం అందించి పునరావాసం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఆర్వో ఎస్‌ఎస్.రాజు, ఆర్డీవోలు చక్రధర్, సుధాకర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఉమామహేశ్వర్‌రావు, అటవీశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నూతన గ్రీవెన్స్ హాల్ పరిశీలన
కలెక్టరేట్ సమావేశ మందిరం పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదుల విభాగం హాల్‌ను కలెక్టర్ అహ్మద్‌బాబు పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించారు. హాల్‌లో తొమ్మిది కౌంటర్లు ఏర్పాటు చేసే వీలు ఉందని అధికారులు తెలిపారు. ఆయన వెంట డీఆర్వో ఎస్‌ఎస్.రాజు, సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, చక్రధర్ ఉన్నారు.
అనుమతి తప్పనిసరి
Published Wed, Jan 1 2014 4:57 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement