సాక్షి, ఒంగోలు: ఏ దిక్కూ లేనివారికి కాస్తాకూస్తో ఆసరాగా ఉంటుందనుకున్న ప్రభుత్వ పింఛన్ చేతికందని ద్రాక్షగా మారుతోంది. చంద్రబాబు సర్కారు ఆంక్షల పర్వంతో అక్టోబర్ నెల నుంచి పింఛన్ సొమ్ము తీసుకోలేని బాధితుల సంఖ్య వేలల్లో పెరగనుంది. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ అర్హుల జాబితా తయారైందని, తమకు నచ్చని వారి పేర్లను అడ్డగోలుగా తొలగించారనే విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ నుంచి పింఛన్ కోల్పోతున్న వారి సంఖ్య జిల్లాలో 42 వేల మందికి పైగా ఉండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతినెలా ఠంఛనుగా అందే పింఛన్లు గత కొన్ని మాసాలుగా అందకపోవడంతో పండుటాకులకు నిరాశే ఎదురవుతోంది. ఆర్థికపొదుపు పేరిట బహిరంగ ప్రకటనలిస్తూనే అనవసర వ్యవహారాలకు ఇష్టానుసారంగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం అభాగ్యుల మెడపై కత్తి దూస్తోంది. ప్రత్యేక కమిటీల్లో సభ్యులుగా ఉన్న అధికారుల సర్వేనే తప్పుల తడకగా సాగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరగకుండా ఒకే దగ్గర కూర్చొని కూడికలు, తీసివేతలు చేశారని, వాస్తవాలను వక్రీకరించారని కనిగిరి, మార్కాపురం, యరగొండపాలెం నియోజకవర్గాల నుంచి అనేక ఫిర్యాదులొచ్చాయి.
ఇదీ లెక్క...
జిల్లాలో ఇప్పటిదాకా నెలనెలా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు మొత్తం 3,12,983 మంది ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో 2,54,505 పట్టణ ప్రాంతాల్లో 24,700.
ఇంకా అనుసంధానం కాని లబ్థిదారుల సంఖ్య 31,078.
ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నప్పటికీ సరైన ధ్రువీకరణ పత్రాల్లేవంటూ తాజాగా జిల్లాలో 22,200.
బయోమెట్రిక్ విధానంతో చేతివేలి ముద్రలు సరిగా పడనివారు 1450 పైవారందరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదు.
జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ వరకు పింఛన్ల పంపిణీ 2,82,774 మందికి రూ.8.73 కోట్లు అవుతుండగా, అక్టోబర్ నుంచి లబ్థిదారుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఒకేసారి 42 వేల మందిపై వేటు వేయనుండడంతో ఈ సంఖ్య మరింత తగ్గనుంది.
సామాజిక పింఛన్‌దారుల్లో ఆందోళన
Published Wed, Sep 24 2014 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement