చెవిరెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా చంద్రగిరి వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అధికార పార్టీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతి పాదించింది. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ నోటీసు ఇచ్చారు. చెవిరెడ్డి ఈనెల 22న శాసనసభాపతికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సభా నిబంధనలలోని 168వ రూల్ కింద ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. అనుమతించాల్సిందిగా కోరడంతో స్పీకర్ ఆమోదించారు. నోటీసును స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
అభాండాలు వేసి నోటీసులిస్తారా?: చెవిరెడ్డి
అప్రజాస్వామిక పదజాలం ఉపయోగించానని, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాన ంటూ తనపై అభాండాలు వేసి నోటీసివ్వడం ఎంతవరకు సబబ ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యా ఖ్యానించారు. ఆయన మీడియా పాయింట్‌లో మా ట్లాడుతూ విచక్షణ మరిచి స్పీకర్‌ను అవమానించే లా మాట్లాడటం తనకు చేతకాదన్నారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ తీర్పు అధికార పక్షం వైపుంటే చేయగలిగిందేముంటుందన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్పీకర్‌ను తామూ ఎన్నుకున్నామని, ఆయనంటే తమకూ గౌరవముందని వీటన్నిటిపై లోతైన చర్చ జరగాలని కోరారు.