'కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదు..పార్టీలోనే ఉంటా'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. అన్నిపార్టీలు అంగీకరించిన తర్వాతే చిట్టచివరగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించినవారు పార్టీనే నిందించడం సరికాదన్నారు. తాను చివరివరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.