ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం డీసీసీబీ మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా సారయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోనియా నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రైతులకు రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చి న సోనియాకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా డీసీసీబీ పని చేస్తోందన్నారు. సహకార సంఘాల చైర్మన్లకు వేతనాలు పెంచడం, అవిశ్వాస తీర్మాన సమయాన్ని పెంచడం, ప్రొటోకాల్‌పై చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానన్నారు. చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మన్లు, ఉద్యోగులు సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ రైతులకు మోసం చేయడం తెలియదని, నిజాయితీగా ఉంటారని, తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ముందుంటారన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో మడికొండలో టెక్స్‌టైల్స్ పార్కు మంజూరైందని వివరించారు. అదేవిధంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమ మంజూరుకు కృషి చేస్తున్నానని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం రాయితీతో కూడిన వన్‌టైం సెటిల్‌మెంట్ పథకాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు.
రాణిరుద్రమ డిపాజిట్ పథకం ప్రారంభం..
డీసీసీబీ అత్యధిక వడ్డీతో కూడిన రాణిరుద్రమ పథకాన్ని బస్వరాజు సారయ్య ప్రారంభించారు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి మిగతా బ్యాంకుల కంటే అధికంగా వడ్డీ వ స్తుంది. దీంతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాల కిం ద ట్రాక్టర్లు అందించారు. డీ సీసీబీలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ప్రారంభించారు. రేబర్తి, నర్మెట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రూ పొందించిన క్యాలెండర్లను మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి, డీసీసీబీ సీఈఓ వి.సురేందర్, ఆప్కాబ్ డీజీఎం ఉదయ్‌భాస్కర్, ఆప్కో డెరైక్టర్ మూర్తి, డీసీసీబీ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డెరైక్టర్లు జయపాల్‌రెడ్డి, జనార్దన్, సుధీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బిక్కు, రేబర్తి పీఏసీఎస్ చైర్మన్ కామిడి రమేష్‌రెడ్డి, నర్మెట పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు
Published Mon, Jan 20 2014 3:32 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement