'50 మంది ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలం'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా అందరికీ నిజనిర్ధారణ పరీక్షలు చేస్తే ఎవరు సమైక్యవాదులో తెలుస్తుందని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే 50 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఓటేస్తారని చెప్పారు. లేకపోతే మంత్రి బాలరాజు, తాను మాత్రమే తెలంగాణకు అనుకూలంగా మిగులుతామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనకు తాను అనుకూలమని అసెంబ్లీలో మంత్రి బాలరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజన విషయంలో తమ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. దీంతో సమైక్యవాదులు ఆయనపై మండిపడ్డారు. ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ కూడా తెలం‘గాణం’ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.