తణుకు : ‘కొత్తగా పదవులు చేపట్టాం. మునిసిపాలిటీల్లో కొద్దోగొప్పో సొమ్ములున్నారుు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిద్దాం’ అనుకుంటున్న పురపాలకులకు ఇసుక కొరత కంట్లో నలుసులా మారింది. దీంతో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో సుమారు రూ.40 కోట్ల విలువైన పనులు నిలిచి పోయూరు.
నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మునిసిపల్, సార్వత్రిక ఎన్నికల కోడ్ పుణ్యమా అని మూడు నెలలపాటు అభివృద్ధి పనులు పడకేయగా.. ఎన్నికల కోడ్ ముగిసి, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవుల్లో కొలువు తీరిన తరువాత అయినా పెండింగ్ పనులన్నీ వేగం పుంజుకుంటాయని ప్రజలు భావించారు. కానీ.. ఇసుక కొరత ఏర్పడటంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.
తణుకు ప్రాంతంలో మొన్నటివరకూ ఐదు యూనిట్ల ఇసుక రూ.6 వేలకే లభించగా, ప్రస్తు తం బ్లాక్ మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్న ఐదు యూనిట్ల ఇసుక రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంత మొ త్తం వెచ్చించి ఇసుక కొనుగోలు చేయలేక కాంట్రాక్టర్లు ఎక్కడ పనులను అక్కడే వదిలేస్తున్నారు. ఇసుక రీచ్ ల వేలం పాటలకు సంబంధించి నూతన విదానాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో అత్యవసరంగా చేయాల్సిన పనులకు ఆటంకం కలుగుతోంది.
అన్నిచోట్లా ఇదే పరిస్థితి
ఇసుక కొరత కారణంగా జిల్లాలోని ముని సిపాలిటీల్లో సీసీ రోడ్లు, మేజర్ డ్రెరుున్లు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. భీమవరం మునిసిపాలిటీలో రూ.10 కోట్లు, తణుకు మునిసిపాలిటీలో రూ.8.50 కోట్లు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటిలో రూ.5 కోట్లు, నరసాపురం మునిసిపాలిటిలో రూ.3 కోట్లు, పాలకొల్లు మునిసిపాలిటీలో రూ.2 కోట్లు ,కొవ్వూరు మునిసిపాలిటీలో రూ.3 కోట్లు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో రూ1.50 కోట్లు, నిడదవోలు మునిసిపాలిటీలో రూ.2కోట్లు , ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు రూ.6 కోట్ల విలువైన పనులు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.
దీంతోపాటు పంచాయతీరాజ్, మం డల పరిషత్, గ్రామ పంచాయతీలు, ఆర్‌డబ్ల్యుఎస్, గృహ నిర్మాణం తదితర శాఖల్లోనూ కోట్లాది రూపాయల విలువైన పనులు పడకేశారుు. గనుల శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనూ ఇసుక కొరత ఏర్పడటం, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
అభివృద్ధి కంట్లో ఇసుక నలుసు
Published Tue, Jul 22 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement