జహీరాబాద్, న్యూస్‌లైన్ : కాంట్రాక్టు కార్మికుడిపై అకారణంగా చేయి చేసుకున్న సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మండలంలోని బూచనెల్లి వద్ద గల ఎంజీ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కాంట్రాక్టు కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. కర్మాగారంలో కాంట్రా క్టు కార్మికుడిగా పని చేస్తున్న మహబూబ్‌పై సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న కులకర్ణి అకారణంగా చేయి చేసుకున్నాడని కార్మికులు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ నిమిత్తం వారు కర్మాగారానికి వస్తే అధికారులు సూపర్‌వైజర్ కులకర్ణిని లేడని తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు.
కార్మికుడిపై చేయి చేసుకున్న సూపర్‌వైజర్ కులకర్ణిపై యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో యాజమాన్యం కార్మిక నేతలను చర్చలకు పిలిచింది. సూపర్‌వైజర్ కులకర్ణి జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పడంతో కార్మికులు విధుల్లో చేరారు.
తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
కర్మాగారంలో పని చేస్తున్న 24 మంది కార్మికులను అకారణంగా విధుల్లో నుంచి యాజమాన్యం తొలగించిందని బాధిత కార్మికులు వాపోయారు. మూ డు నెలలు అవుతున్నా తమను విధుల్లో చేర్చుకునే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అద్దెలు కూడా చెల్లించుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంలో యా జమాన్యం స్పందించి తమను విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని బాధితులతో పాటు తోటి కార్మికులు కోరారు.
కాంట్రాక్టు కార్మికుల విధుల బహిష్కరణ
Published Tue, Feb 11 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement