తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. సోమవారం హౌసింగ్ బోర్డు ఎదురుగా వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో కోటీ 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న విత్తన పరిశోధనా కేంద్రానికి మంత్రి మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మునిసిపల్ చైర్మన్ బొలిశె ట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు బెడద తప్పించేందుకు, మంచి విత్తనాలు పొందేందుకు విత్తన పరీక్షా కేంద్రాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఎంపీడీవోలు మల్లికార్జునరావు, దోసిరెడ్డి, తహసిల్దార్ పాశం నాగమణి, వ్యవశాయ శాఖ ఇన్‌చార్జి ఏడీ కె.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖధికారి వేణుగోపాలరావు తదితరులు
పాల్గొన్నారు.
వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి
Published Tue, Apr 21 2015 4:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement