బద్వేలు అర్బన్: పురాతన విగ్రహాలు, రాగి వస్తువులతో (రైస్‌పుల్లింగ్) వ్యాపారం చేసే ముఠాను బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి పట్టణంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పురాతన రాగి బిందెను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులున్నట్లు తెలిసింది. బి.మఠం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల కాలంలో పురాతన విగ్రహాలు విక్రయిస్తామని ఆశచూపి మోసగిస్తున్నట్లు సమాచారం తెలియడంతో నిఘా పెట్టిన బద్వేలు పోలీసులు అతనితో చర్చిస్తున్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వ్యక్తి తన వద్ద ఉన్న పురాతన విగ్రహాలు, పురాతన రాగిపాత్రలలో ఉండే కాపర్ ఇరిడియం(బంగారం కంటే విలువైంది)ను అమ్మి సొమ్ము చేసుకోవచ్చని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులను బద్వేలుకు పిలిపించినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులలో కొందరు గతంలో కొంతమందిని పురాతన విగ్రహాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరికొంతమంది వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో పురాతన విగ్రహాల ముఠా?
Published Mon, Mar 2 2015 1:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement