
సాక్షి, తాడిపత్రి : ప్రబోధానందస్వామి భక్తులకు, తాడిపత్రి పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. ఆశ్రమంలోకి పోలీసులు తమను అనుమతించడంలేదంటూ జయలక్ష్మీ, భూలక్ష్మీ అనే మహిళా భక్తులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమంలోకి అనుమతించకుండా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనీ, మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని వాపోయారు. ఆధార్ కార్టులు చూపినా ఆశ్రమంలోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఆశ్రమంలోని తమ గదులను కూడా పోలీసులు ఆక్రమించారని అన్నారు. ‘ప్రబోధానంద ఆశ్రమంలో దేవుడు లేడు’ అంటూ హేళనగా మాట్లాడుతున్నారనీ, తమ సెంటిమెంట్లను అగౌరపరుస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమంలోకి అనుమంతించకపోతే తమకు చావే శరణ్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment