ashramam
-
అభాగ్యులకు అమ్మలా..
మతిస్థిమితం కోల్పోయిన మానసిక వికలాంగులకు, అనాథలకు అండగా నిలుస్తోంది.. ఏ చిరునామా లేని అభ్యాగులకు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. రుచికరమైన భోజనం వడ్డించడంతో పాటు దుస్తులు, పడుకునేందుకు మంచం, దుప్పటి వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.. తమకు ఎవరూ లేరనే బాధ నుంచి అక్కడ ఉన్నవారంతా తమవారే అన్న భరోసా ఇస్తోంది.. కుల మత, భాషా బేధాలతో సంబంధం లేకుండా అభాగ్యులందరినీ చేరదీస్తోంది. అంతేకాదు అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ మానసిక దివ్యాంగుల ఆశ్రమం. – బడంగ్పేట్ఒక్కరితో 2018లో ప్రారంభమైన ఈ ఆశ్రమ సేవలు ప్రస్తుతం 150 మందికి చేరుకున్నాయి. మధ్య వయసులో మతి స్థిమితం కోల్పోయి.. జుట్టు, గడ్డాలు, మీసాలు పెరిగి గుర్తుపట్టలేని స్థితిలో అర్ధనగ్నంగా వీధుల్లో సంచరిస్తున్న వారితో పాటు నగరంలోని ప్రధాన రోడ్ల వెంట, డ్రైనేజీలు, చెత్త డబ్బాల పక్కన దీనంగా పడి ఉన్న అనాథలను ఆశ్రమానికి తరలిస్తున్నారు మాతృదేవోభవ సంస్థ నిర్వాహకులు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కోలుకున్న వారిని తిరిగి ఇళ్లకు పంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 280 మందికి పునర్జన్మను ప్రసాదించారు. ఆశ్రమ సేవలు గుర్తించిన సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారు కూడా అభాగ్యులకు సేవలు అందిస్తుండటం విశేషం. పండగలు, పర్వదినాలు, పుట్టిన రోజులు ఇలా అన్ని సందర్భాల్లోనూ వారు భాగస్వాములు అవుతున్నారు.‘ఈయన పేరు డి.శివుడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. ఆరేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి.. ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఊరే కాదు చివరకు జిల్లా సరిహద్దులు దాటుకుని చివరకు ఉప్పల్ చేరుకున్నాడు. రోడ్డు వెంట అనాథగా తిరుగుతున్న ఆయనను మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించి వైద్యం అందించారు. కోలుకున్న తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ వృద్ధాప్యంతో మంచం పట్టిన తల్లికి సపర్యలు చేస్తున్నాడు’ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు ఏదైనా ప్రమాదాల్లో చనిపోయిన అనాథ శవాలనే కాకుండా ఆశ్రమంలో ఉంటూ వృద్ధాప్యం, ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయిన వారికి ఆయా మతాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతిమ యాత్రలో మాతృదేవోభవ అనాథ ఆశ్రమం వ్యవస్థాపకుడు గిరితో పాటు అతడి భార్య ఇందిర, అమ్మ ముత్తమ్మ, కొడుకు అభిరాం, కూతురు లోహిత ఆ నలుగురిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 60 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సేవలను గుర్తించిన పలు సంస్థలు గిరిని గౌరవ డాక్టరేట్‌తో పాటు 300 అవార్డులతో సత్కరించాయి. నాడు‘చిత్రంలోని ఈయన పేరు కావూరి నాగభూషణం. పశి్చమగోదావరి జిల్లా పొలమూరు మండలం నాగిళ్లదిబ్బ గ్రామం. ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి బంజారాహిల్స్ చేరుకున్నాడు. చినిగిన దుస్తులు, మాసిన గడ్డం, పెరిగిన జుట్టుతో తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ.. తిరుగుతూ కని్పంచాడు. మాతృదేవోభవ ఆశ్రమం నిర్వాహకులు ఆయనను చేరదీసి, ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తెలుపగా.. ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆయన్ను బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం సొంత ఊరిలో రెండు ఆవులను చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాడు’ నేడు నాడు‘చిత్రంలో కనిపిస్తున్న ఇతడి పేరు వట్టేం రమేష్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం, శివపురం గ్రామం. నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరకు నగరానికి చేరుకున్నాడు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమ నిర్వాహకులు చేరదీసి ఆశ్రమం కల్పించారు. అతడికి మెరుగైన చికిత్సతో పాటు ప్రశాంత వాతావరణం కల్పించడంతో నాలుగేళ్లకు ఆరోగ్యం కుదుటపడింది. కుటుంబ వివరాలు తెలుసుకుని, చివరకు వారికి అప్పగించారు. ప్రస్తుతం సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నాడు’నేడు కొంత స్థలం కేటాయించాలి శాశ్వత భవనం లేకపోవడంతో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కాలిక షెడ్లు వేసి, వాటిలో వసతి కలి్పస్తున్నాం. స్థలం కేటాయిస్తే మరింత మందికి సేవలు అందిస్తాం. ఆశ్రమంలో ఉన్న వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ సహా ఆరోగ్యశ్రీకార్డు, రేషన్ బియ్యం ఉచితంగా అందజేయాలి. – గట్టు గిరి, ‘మాతృదేవోభవ’ఆశ్రమ వ్యవస్థాపకుడు -
యువతిపై యాసిడ్ దాడి: ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో
బనశంకరి(బెంగళూరు): యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు నాగేశ్ బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధిత యువతి కూడా ఆస్పత్రిలో క్రమంగా కోటుకుంటోంది. పరారీలోనున్న నాగేశ్ తిరువణ్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడంతో ఆచూకీ తెలియక పోలీసులు తలకిందులయ్యారు. చివరకు స్థానిక ఓ విద్యార్థి సహాయంతో దుండగున్ని పట్టుకున్నారు. ఫోటో తీసి పంపితే కామాక్షిపాళ్య పోలీసులు తిరువణ్ణామలై ప్రభుత్వ బస్టాండు వద్ద నాగేశ్ కోసం వాంటెడ్ ప్రకటనలు అంటించి పలు ఫోన్ నంబర్లు ఇచ్చారు. అతన్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తుండగా చూశానని ఒక విద్యార్థి పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. అతని ఫోటోను కూడా రహస్యంగా తీసి పంపాడు. ఫోటో చూసి నాగేశ్ అని పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ రవికుమార్, పోలీసులు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లి నాగేశ్ పక్కన కూర్చున్నాడు. తమిళంలో మీ పేరు అని అడిగారు. దీనికి అతను జవాబివ్వలేదు. పోలీసులు నాగేశ్ అని పిలవడంతో అతను తిరిగి చూశాడు. దీంతో నిర్బంధించి తరలించారు. క్లూ రాకపోయి ఉంటే అతడు ఇప్పట్లో దొరక్కపోయేవాడు. చదవండి: వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి.. -
శిగం ఊగుతుందని..
యాదగిరిగుట్ట: వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆలనాపాలనా చూడాల్సిన కొడుకులు కర్కోటకులయ్యారు. నవ మాసాలు మోసి కని పెంచిందని కనీసం కనికరం లేకుండా వ్యవహరించారు. శివసత్తి శిగం ఊగుతుందని, కర్రలతో కొట్టి.. రోడ్డున పడేశారు. ఈ సంఘటన గురువారం యాదగిరిగుట్టలో వెలుగుచూసింది. వివరాలు.. హైదరాబాద్‌లోని సీతారామబాద్‌కు చెందిన యాదమ్మ (65), విఠల్ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. యాదమ్మ మంగళవారం, శనివారం శిగం ఊగుతుంటుంది. దీంతో భర్తతో పాటు కుమారులు, కోడళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో రోజూ ఆమెను కొట్టడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారు. చివరికి ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించారు. వారం క్రితం యాదగిరిగుట్టకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు. లక్ష్మీ సినిమా థియేటర్ సమీపంలో ఓ ఇంటి అరుగుపై అనారోగ్యంతో బాధపడుతున్న యాదమ్మను గమనించిన స్థానికులు.. వంగపల్లిలోని అమ్మఒడి అనాథ ఆశ్రమానికి పంపించారు. కుటుంబ సభ్యులు నిత్యం చిత్రహింసలకు గురిచేసేవారని యాదమ్మ తమతో చెప్పినట్లు ఆశ్రమ నిర్వాహకులు జెల్లా శంకర్ తెలిపారు. కుటుంబ సభ్యుల పేరు ఎత్తితేనే ఆమె భయపడుతుందని చెప్పారు. -
మైనర్లపై వేధింపులు; ఆశ్రమ నిర్వాహకుడి అరెస్టు
లక్నో(ఉత్తరప్రదేశ్): మైనర్లపై లైంగికదాడికి పాల్పటమే కాకుండా వారిని కూలీలుగా మార్చిన షుకర్తాల్ ఆశ్రమ యాజమానిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 7న పిల్లల సంరక్షణ హెల్ఫ్‌లైన్ సమాచారం మేరకు పోలీసులు ఎనిమిది మంది పిల్లలను రక్షించిన విషయం తెలిసిందే. వీరంతా 7 నుంచి 10 ఏళ్లలోపు వారేనని పిల్లలంతా త్రిపుర, మిజోరం, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. స్వామి భక్తి భూషన్ గోవింద్ మహారాజ్ అనే వ్యక్తి షుకార్తాల్‌లో 2008లో ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు మైనర్లంతా భూషన్ ఆశ్రమంలో నివసిస్తున్నారు. భూషన్ బాలికలను తరచూ లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా బలవంతంగా వారిని కూలీ పనుల నిమిత్తం ఇతరుల వద్దకు పంపించేవాడు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల పిల్లలను రక్షించి సంక్షేమ బోర్డు ముందు హాజరపరిచారు. వైద్య పరీక్ష నిమిత్తం పిల్లను ఆసుపత్రికి పంపించగా వీరిలో నలుగురు పిల్లలు లైంగిక వేధింపులకు గురైనట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఆశ్రమ యాజమాని భూషన్‌తో పాటు మిగతా సిబ్బందిని అరెస్టు చేశామని చెప్పారు. భూషన్ ఆశ్రమం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 323, 502, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పుగా ఈ కేసులో చిక్కుకున్నానంటూ భూషన్ పేర్కొన్నారు. -
అమెరికాలో పీహెచ్డీ.. ఆశ్రమంలో బందీ!
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో పీహెచ్డీ పూర్తిచేసి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేసే తన కూతురు ఢిల్లీలోని ఓ ఆధ్యాత్మిక ఆశ్రమంలో బందీగా మారిందని, ఆమెను విడిపించి రక్షించాలంటూ ఓ యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈ కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. హైదరాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి కూతురు సంతోష్ రూప జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్ పూర్తి చేసి అమెరికాలోని లూయిస్విల్లే వర్సిటీలో 2005 నుంచి 2012 వరకు ఎంఎస్, పీహెచ్డీ పూర్తిచేసింది. అనంతరం అక్కడే ఐఓడబ్ల్యూఏ వర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ కోర్సులో చేరింది. పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా కూడా 2015 వరకు పనిచేసింది. 2015 జూలైలో అకస్మాత్తుగా వర్సిటీ విడిచిపెట్టింది. అయితే ఎక్కడికి వెళ్లిందన్న విషయంలో తల్లిదండ్రులకు, ప్రొఫెసర్లకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కొంతకాలానికి రూప.. ఢిల్లీ రోహిణీ ప్రాంతంలోని విజయ్‌విహార్‌లో వీరేంద్ర దీక్షిత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వర్సిటీ పేరుతో నడుపుతున్న ఆశ్రమంలో ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. బ్యాంకు ఖాతాలో రూ.కోటి కాగా, రూప ఆశ్రమంలో చేరేనాటికి ఆమె బ్యాంకు ఖాతాలో దాదాపు కోటి రూపాయలు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురు కోసం సంప్రదించిన ప్రతిసారి ఆశ్రమ నిర్వాహకులు సంతోష్ రూప ఇష్టానికి భిన్నంగా తాము ఒత్తిడి తెస్తున్నామని, తమ నుంచే రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసేవారని తెలిపారు. కాగా, ఈ ఆశ్రమంలో అనేక మంది బాలికలు, మహిళలు బందీలుగా ఉన్నారని, వారిని కాపాడాలని 2017లో ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఓ కమిటీ వేసింది. వందలాది మంది బాలికలు, మహిళలను అక్కడ పశువుల కొట్టాన్ని తలపించేలా ఉంచారని, అక్కడ ఎలాంటి వసతుల్లేవని, వైద్యం కూడా అందట్లేదని, ఇరుకైన సందులు ఉన్నాయని కమిటీలో ఉన్న న్యాయవాది నందితారావు నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ అలవాటు పడ్డట్లు కనిపించారని వివరించారు. వారిని చీకటి గదుల్లో ఉంచారని, వారు పడుకునే ప్రాంతంలో కూడా పర్యవేక్షణ ఉండదని, వారికి ఎలాంటి గోప్యత లేదని తెలిపారు. ఆ తర్వాత హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే వీరేంద్ర దీక్షిత్ అదృశ్యమయ్యాడని 2018లో హైకోర్టుకు సీబీఐ తెలిపింది. తాము వృద్ధాప్యంలో ఉన్నామని, రూ.2 వేల పెన్షన్ డబ్బులతో బతుకుతున్నామని, కూతురిని తీసుకెళ్లేందుకు ఇక్కడే ఢిల్లీలో ఒక గది అద్దెకు తీసుకుని బతుకుతున్నామని తల్లిదండ్రులు పిటిషన్లో పేర్కొన్నారు. తమ కూతురు జైలులాంటి వాతావరణంలో ఉండటాన్ని చూసి మానసిక క్షోభతో తమ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని తెలిపారు. తమ బాగోగులు చూసుకునేందుకైనా తమ కూతురును పంపించాలని కోరారు. తమ కూతురు డ్రగ్స్‌కు బానిసై ఉంటుందని, ఆమె ఆరోగ్యంగా లేదని వివరించారు. ఆశ్రమంలో ఆత్మహత్య జరిగినందున తమ కూతురు క్షేమంపై బెంగగా ఉందని వివరించారు. -
మూగజీవాల అమ్మ
మనిషికి ఏదైనా అపాయం జరిగినా కన్నెత్తి చూడని, నోరెత్తి పలకరించిన ఈ సమాజంలో మూగజీవాల గాయాలకు మందు రాసి, బలికాబోయే జీవాలను రక్షించి ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు ఢిల్లీ వాసి అంజలి గోపాలన్. ‘ఆల్ క్రియేచర్స్ గ్రేట్ అండ్ స్మాల్’ అనే పేరుతో మూగజీవాలకు ఆశ్రమం ఏర్పాటు చేసిన అంజలి ప్రతీ మూగజీవి ఆరోగ్యం, పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఒక గేదె కాలి వెనుక భాగంలో గాయమై ఎటూ కదలక ఉండటం గమనించింది అంజలి గోపాల్. దాని కాలికి కట్టుకట్టి, మేత వేసింది. ఎంతకాలం ఎదురు చూసినా దాని సంబం«ధీకులు ఎవరూ రాలేదు. దాంతో తను స్థాపించిన షెల్టర్‌కి చేర్చింది అంజలి. దానికి భీమ్ అని పేరు పెట్టింది. భీమ్ 700 మూగజీవాల్లో ఒకటిగా చేరింది. అన్ని జీవాలకు ఒక్కో పేరు పెట్టి, తాను పెట్టిన పేరుతో వాటిని పిలుస్తూ బిడ్డల్లా సాకుతుంది అంజలి గోపాలన్. ఈ ఆశ్రమంలో వందకు పైగా కన్ను, చెవులు పోయిన జీవాలున్నాయి. ఈ మూగజీవాల గురించి అంజలి మాట్లాడుతూ ‘మానవ ప్రపంచంలో ఎందుకూ పనికి రావనుకున్న జీవాలను ఏదో విధంగా చంపేస్తుంటారు. అలాంటి దృశ్యాలను చూసి, మనసు చెదిరి ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేశాను’ అని చెబుతారు. గాయాలకు మందు ఢిల్లీ కుతుబ్ మినార్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్ జిల్లాలోని సిలఖారీ గ్రామంలో అంజలి గోపాలన్ ఈ మూగజీవాల ఆశ్రమం నడుపుతోంది. 1994లో ఢిల్లీలో హెచ్ఐవి బాధితుల కోసం ఆశ్రమాన్ని స్థాపించిన సామాజిక కార్యకర్త ఆమె. ఇప్పుడు ఈ ప్రాంతానికి సందర్శకులూ వచ్చి చూస్తుంటారు. ‘2012లో ఈ షెల్టర్‌ను ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల అంతా ఇదో ‘పిచ్చి’ ప్రయోగం అన్నారు. రాజధానిలో అంజలి ఒక జంతువుల ఆశ్రమాన్ని చూసినప్పుడు అక్కడ ఉంచిన జంతువుల స్థితిని చూసి భయపడ్డారు. జంతువులకు నరకంగా ఉన్న ఆ పరిస్థితులను చూసి మానవులుగా మనం మరింత పాపం చేస్తున్నట్టు భావించారు. కానీ, సరైన స్థలం ఎక్కడా దొరకలేదు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం అప్పటికే బాధితులతో నిండి ఉంది. అప్పుడే అంజలి ఫరీదాబాద్‌లో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి, షెల్టర్ ఏర్పాటు చేశారు.. వృద్ధాప్యం, అనారోగ్యం, గాయాల కారణంగా బయట జీవించలేని కుక్కలను ఈ షెల్టర్‌లో ఉంచాలనుకుంది. ముందు 55 శునకాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ షెల్టర్‌లో 460 జీవాలు సేదతీరుతున్నాయి. రక్షణ కేంద్రం మెల్ల మెల్లగా కొన్నాళ్లకు పెద్ద జంతువులు రావడం మొదలైంది. దీంతో ఒక్కోరకం జంతువులకు ఒక్కో తరహా స్థలం కేటాయించారు. ఈ షెల్టర్‌కి వచ్చిన ప్రతి జీవి వైద్యచికిత్స పూర్తయ్యాక గాని ఇక్కడ నుంచి బయటకు రాదు. 23 మంది సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తుంటారు. ‘ఈ జీవాలను చూస్తే మానవ క్రూరత్వం ఎంతటిదో అర్థమవుతుంది’ అంటుంది అంజలి. ‘జైపూర్ నుంచి ఒక యువకుడు ఒంటెను తీసుకొచ్చాడు. దానికి ఎలాంటి పోషణ లేదు. పైగా దాని తలమీద సుత్తితో తీవ్రంగా బాదిన గాయం. ఆ గాయం నయం కావడానికి ఐదేళ్లు పట్టింది. అలాగే కత్తికి బలికాబోయే సమయంలో రక్షించిన 20 మేకలు ఇక్కడ ఉన్నాయి. పొడవాటి జుట్టు, గడ్డం అంత పొడవుగా వేలాడే చెవులు ఉన్న ఓ పర్వత మేక, వైద్య పరిశోధన కోసం తీసుకెళ్లి కోయాలనుకున్న మేక.. ఇలా ఒక్కోటి రక్షింపబడి ఇక్కడకు చేరుకున్నవాటిలో ఉన్నాయి. కుక్కలను, ఆవులను ప్రేమగా నిమిరి, గేదెలు, దూడలు సమూహంతో కాసేపు గడిపి ఈమూ పక్షులతో సంభాషించడంతో అంజలి గోపాలన్ రోజు గడుస్తుంది. – ఆరెన్నార -
నిత్యానంద ఆశ్రమం ఖాళీ, బిగుస్తున్న ఉచ్చు
అహ్మదాబాద్: వివాదాస్పద మత బోధకుడు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆశ్రమంలో బాలికలపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు మరోసారి దాడులు నిర్వించారు. పలు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిత్యానంద ఆశ్రమాన్ని జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. బాలికల అపహరణ, కిడ్నాప్లాంటి ఇతర క్రిమినల్ అభియోగా నేపథ్యంలో స్థానిక పోలీసులు తాజా దాడులు నిర్వహించారు. ల్యాప్‌టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆశ్రమంలోని భక్తులంతా ఆశ్రమాన్ని వీడారు. అంతేకాదు స్వాధీనం చేసుకున్న డివైస్‌లలో మైనర్ పిల్లలపై శారీరక దాడి, వేధింపులు, తీవ్రంగా హింసిస్తున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యానంద తన కుమార్తెలను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ గత నెలలో గుజరాత్ రాష్ట్ర పిల్లల రక్షణ పరిరక్షణ కమిషన్‌తో పాటు గుజరాత్ హైకోర్టును ఆశయించారు. పిల్లల్ని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. అయితే పోలీసుల చొరవతో ఇద్దరు కుమార్తెలకు విముక్తి లభించగా, పెద్ద కుమార్తెలిద్దరు నిత్యానంద సంస్థను విడిచి పెట్టడానికి నిరాకరించారు. తన పిల్లలను ఆశ్రమంలో బ్రెయిన్ వాష్ చేసి హింసించారని శర్మ ఆరోపించారు. అయితే వీరిని గుర్తించాల్సిందిగా గుజరాత్ హైకోర్టు నవంబర్ 26న పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఇంటర్‌పోల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. దీంతో కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు పరారీలో ఉన్న నిత్యానందకోసం గాలిస్తున్నారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ) అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఎన్ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) నిత్యానంద ఆశ్రమాన్ని నడుపుతున్నట్టు నిర్ధారించిన తరువాత అహ్మదాబాద్, హిరాపూర్, దాస్క్రోయిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు మంజూరు చేసిన సీనియర్ సెకండరీ స్థాయి వరకు తాత్కాలిక/సాధారణ ఎఫిలియేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకుందని సీబీఎస్ఇ నోట్‌ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. అయితే 2020 లో 10, 12 తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షకు హాజరుకావడానికి, తొమ్మిదవ తరగతి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సమీపంలోని సీబీఎస్ఐ-అనుబంధ పాఠశాలలకు మార్చడానికి బోర్డు అనుమతించింది. కాగా అయితే అత్యాచారం కేసులో విచారణను తప్పించుకునేందుకు నిత్యానంద విదేశాలకు పారిపోయినట్టుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యానంద పాస్‌పోర్ట్ గడువు 2018 సెప్టెంబర్‌లో ముగిసిందనీ, అత్యాచారం ఆరోపణల కారణంగా రెన్యువల్ చేయలేదనీ ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారో తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఆశ్రమంలోకి అనుమంతించకపోతే..
సాక్షి, తాడిపత్రి : ప్రబోధానందస్వామి భక్తులకు, తాడిపత్రి పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. ఆశ్రమంలోకి పోలీసులు తమను అనుమతించడంలేదంటూ జయలక్ష్మీ, భూలక్ష్మీ అనే మహిళా భక్తులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమంలోకి అనుమతించకుండా పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనీ, మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని వాపోయారు. ఆధార్ కార్టులు చూపినా ఆశ్రమంలోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. ఆశ్రమంలోని తమ గదులను కూడా పోలీసులు ఆక్రమించారని అన్నారు. ‘ప్రబోధానంద ఆశ్రమంలో దేవుడు లేడు’ అంటూ హేళనగా మాట్లాడుతున్నారనీ, తమ సెంటిమెంట్లను అగౌరపరుస్తున్నారని ఆరోపించారు. ఆశ్రమంలోకి అనుమంతించకపోతే తమకు చావే శరణ్యమని అన్నారు. -
దివ్యాంగులకు దిక్సూచి
విధి చిన్నచూపు చూసినా అతడు కుంగిపోలేదు. వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించాడు. పేదరికాన్ని జయించి చదువుకుని రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. తనలా శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలనేఆశయంలో ఉద్యోగాన్ని వదిలి దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి 56 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. దేవరపల్లి : పోలియో వ్యాధి బారిన పడి రెండు కాళ్లు చచ్చుపడిపోవడంతో మానసికంగా కుంగిపోయాడు దేవరపల్లికి చెందిన కాగిత భాస్కరరావు. చదువుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ పేదరికం అడ్డుగా నిలిచింది. అయినా పట్టుదలతో తల్లిదండ్రులను ఒప్పించి ఇంటర్ వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాడు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి 1994లో దివ్యాంగుల కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ భాస్కరరావుకు తృప్తి లేదు. సమాజంలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను, అవమానాల నుంచి కొంతమదిౖకైనా విముక్తి కల్పించాలని నిర్ణయించుకుని రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2004లో భారతి వికలాంగుల సేవా సమితి స్థాపించి లగడపాటి రామలక్ష్మమ్మ వికలాంగుల ఆశ్రమం పేరున దేవరపల్లి మండలం గొల్లగూడెం వద్ద ఆశ్రమం స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలలో సుమారు 56 మంది దివ్యాంగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చేతివృత్తులతో పాటు కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నారు. దాతల సహకారంతో ఆశ్రమం అభివృద్ధి ఆశ్రమం అభివృద్ధికి ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ దాతల సహకారం లభిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంతోమంది దాతలు ఆశ్రమాన్ని సందర్శించి విరాళాలు అందజేస్తున్నారు. ఎంతోమంది ధనికులు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి్ల రోజు వేడుకలను ఆశ్రమంలో నిర్వహించి దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలుగా భాస్కరరావు ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దివ్యాంగులను అక్కున చేర్చుకుంటున్నారు. ఆశ్రమం ద్వారా వివిధ సేవలు ప్రత్యేక విద్య, చేతివృత్తుల శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ క్లాసులు, దివ్యాంగులకు ఉచిత హాస్టల్ వసతి సౌకర్యం, మెడికల్ క్యాంపుల నిర్వహణ, కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్, క్రచ్చెస్, వీల్‌చైర్స్, ట్రైసెకిళ్లు అందజేయుట, దివ్యాంగులకు వివాహ కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి కాలంలో మినరల్ వాటర్‌తో చలివేంద్రాల ఏర్పాటు, అనాథలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాక కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమం స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పింస్తున్నారు. తనతో పాటు భార్య భారతి, ఇద్దరు పిల్లలు కూడా ఆశ్రమం సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. భాస్కరరావు కుటుంబమంతా దివ్యాగులు, వృద్ధుల సేవలకే అంకితమై పనిచేస్తున్నారు. నా చివరి శ్వాస వరకు దివ్యాగుల సేవలోనే ఉంటానని భాస్కరరావు అంటున్నారు. వృద్ధుల కోసం దాతల సహకారంతో భవన నిర్మాణం చేస్తున్నారు. -
షాక్.. వెలుగులోకి మరో డేరా బాబా
-
షాక్.. వెలుగులోకి మరో డేరా బాబా
సాక్షి, న్యూఢిల్లీ : మరో ఫేక్ బాబా గుట్టు రట్టయ్యింది. దేశరాజధానిలోని ఆధ్మాత్మిక ముసుగులో దారుణాలను పాల్పడుతున్న బాబా వీరేందర్ దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి సందర్భంగా భయానక దృశ్యాలు బయటపడ్డాయి. బోనుల్లాంటి గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పోలీసుల సహకారంతో మహిళా కమీషన్ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిపించింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో వీరేందర్‌కు చెందిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఆశ్రమంపై గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున్న సెక్స్ రాకెట్ నడుపుతున్నాడంటూ దీక్షిత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలతో నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. వీరేంద్రను తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ డిమాండ్ చేస్తున్నారు. తనపై బాబా వీరేంద్ర లైంగికదాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 100 మందికి పైగా మహిళలు ఆశ్రమంలో బందీలుగా ఉన్నారని.. వారిని జంతువుల్లా హింసిస్తున్నారని అడ్వొకేట్ నందిత రావ్ కోర్టుకు వివరించారు. పెద్ద ఎత్తున్న అమ్మాయిలతో ఆశ్రమంలోనే సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆమె వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీబీఐకి సోదాలు నిర్వహించాల్సిందిగా బుధవారం ఆదేశించింది. దశాబ్దం పైగానే... ఆధ్యాత్మిక విశ్వవిద్యాయంలో కొందరు మహిళలను, బాలికలను 14 సంవత్సరాలుగా బందీలుగా ఉంచారని ఓ ఎన్జీవో హైకోర్టుకు జారీ చేసిన పిటిషన్లో పేర్కొంది. తాను ఆశ్రమం నుంచి తప్పించినట్లుగా పేర్కొన్న ఓ యువతిని ఈ సంస్థ కోర్టులో హాజరుపరిచింది. డ్రగ్స్ ఇచ్చి తనకు బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలో బంధీగా ఉంచినట్లు ఆ యువతి కోర్టుకు తెలిపింది. యువతిపై అత్యాచారం జరిగిందని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదని ఎన్జీవో తెలిపింది. ఆశ్రమంలో పలువురు మహిళలు గతంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కానీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఎన్జీవో ఆరోపించింది. న్యాయస్థానం ఆదేశం మేరకు ఢిల్లీ పోలీసులు, బుధవారం ఆశ్రమంపై దాడి నిర్వహించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, న్యాయవాదుల బందం కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. ఆశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడున్న మహిళలను కలవడానికి తమకు రెండు గంటలు పట్టిందని స్వాతిమలివాల్ చెప్పారు. 150 మందికిపైగా బందీలు.. ఆశ్రమంలో సొరంగం కూడా ఉన్నట్లు పోలీసుల దాడిలో బయటపడింది. సొరంగాన్ని నీటిని నింపారని, అది కూడా ఆదరా బాదరాగా ఇటీవలే నింపారని పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో 150 మందికి పైగా మహిళలు, బాలికలను బందీలుగా ఉంచినట్లు దర్యాప్తు బందం కోర్టుకు తెలిపింది. వారిని ఇనుప సంకెళ్లతో బంధించి ఉంచారని, వారిని నిరంతరం హింసిస్తూ.. లైంగిక బానిసలుగా చూసేవారని దర్యాప్తు బందం తెలిపింది. స్నానం చేయడానికి, పడుకోవడానికి కూడా మహిళలకు ప్రైవసీ లేదని దర్యాప్తు బందం తెలిపింది. ఆశ్రమం నుంచి ఎవరూ పారిపోకుండా ఉండడం కోసం నాలుగు దిక్కులా ఎత్తయిన గోడలు నిర్మించి ముళ్లకంచెలు, లోహపు తలుపులు అమర్చారని వారు తెలిపారు. ఆశ్రమంలో దేహ వ్యాపారం జరుగుతోందని స్థానికులు దర్యాప్తు బందానికి తెలిపారు. రాత్రి పూట ఆశ్రమం గేటు ఎదుట లగ్జరీ కార్లు నిలబడి ఉంటాయని వారు చెప్పారు. దర్యాప్తు విషయం తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమ నిర్వాహకులు తమను కూతుళ్లను కలవనిచ్చేవారు కాదని, వారిని బందీలుగా ఉంచారని తల్లిదండ్రులు ఆరోపించారు. -
కేరళ ఆశ్రమంలో ‘అనంత’ బాలుడు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు కేరళ రాష్ట్రం కాసరగూడ జిల్లా పరవణదుక్కం ప్రభుత్వ ప్రత్యేక బాలసదనంలో ఆశ్రమం పొందుతున్నట్లు ఆ రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, జిల్లా బాలల సంరక్షణాధికారి డాక్టర్ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నుంచి అక్కడ ఆశ్రయం పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ అబ్బాయి తన పేరు లక్ష్మన్ అలియాస్ ఆకాష్ అని, తన ఊరు హిందూపురం అని చెబుతున్నాడని తెలిపారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు గానీ, సంబంధీకులు గానీ ఎవరైనా సదరు ఫొటో చూసి గుర్తు పడితే తగిన ఆధారాలు తీసుకుని ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో 30 రోజుల్లోగా సంప్రదించాలని కోరారు. ఎటువంటి సమాచారం అందకపోతే కేరళ రాష్ట్ర ప్రభుత్వం సదరు అబ్బాయిని అనాథగా ప్రకటించి అమలులో ఉన్న భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేరొకరికి దత్తత ఇస్తారని ప్రకటించారు. -
అనాథలకు ఆలయం
చీకటి జీవితాలకు వెలుగు హౄదయశాంతి ఆశ్రమం వృద్ధుల సేవలో ఆనందరావు మమేకం ‘మౌనం యొక్క ఫలితం ప్రార్థన ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం నమ్మకం యొక్క ఫలితం ప్రేమ ప్రేమ యొక్క ఫలితం సేవ సేవ యొక్క ఫలితం సంతృప్తి’ కలుగుతుందని సేవామూర్తి మదర్‌థెరిసా చెప్పిన మాటలివి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని పొలమరశెట్టి ఆనందరావు వృద్ధులు, అనాథల సేవలో మమేకమయ్యారు. నాకెవ్వరూ లేరు అనేవారికి ఆప్తుడయ్యారు. కూతురు చూడటం లేదని బోరున విలపిస్తే ఓ తల్లిగా కన్నీళ్లు తుడిచారు. కొడుకు నిర్లక్ష్యానికి చావే శరణ్యమనుకుంటున్న ఓ పెద్దాయనకు తాతలా ఓదార్చారు. మీ అందరికీ నేనున్నానంటూ ‘హృదయం’లో స్థానమిచ్చారు. వృద్ధులకు తల్లిగా..తండ్రిగా..స్నేహితుడిగా మారారు. హృదయశాంతి ఆశ్రమం స్థాపించి సేవామూర్తిగా మారారు. –అనకాపల్లి రూరల్ ఆనందరావు సొంత ఊరు కొత్తవలస వద్ద మంగళపాలెం. ట్రెజరీ అధికారిగా అనకాపల్లిలో ఎక్కువ కాలం సేవలందించారు. 2000 సంవత్సరంలో వలంటిరీ రిటైర్మెంట్ తీసుకుని వృద్ధాశ్రమం స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. వృద్ధులకు సకల సౌకర్యాలు కల్పించారు. ఎక్కడెక్కడినుంచి వచ్చిన వారంతా ఒక పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల్లా మారిపోయారు. చివరిమజిలిలో ఆనందరావును ఆ దేవుడే మా కోసం పంపాడని ఆనందబాష్పాలతో చెబుతున్నారు. మనస్ఫూర్తిగా చేయాలి... ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అందుకే ఉద్యోగానికి వలంటిరీ రిటర్మెంట్ ఇచ్చేసి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకూ అదే స్ఫూర్తిగా సేవచేస్తున్నాను. వృద్ధాశ్రమంలో 32 మంది ఉన్నారు. సరైన భోజనం, నిద్రించేందుకు మంచి గదులు, అడగడుగునా జాగ్రత్తలు, బాత్రూం సౌకర్యం, నడవలేని వారికి సాయం చేసేవారు ఉన్నారు. ప్రతి రోజూ ప్రార్థన చేసుకునేందుకు మందిరం, కమ్యూనిటీ హాలు ఇలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు సెటిల్ అవడంతో ఆనందరావు భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో సేవలందిస్తున్నారు. ప్రత్యక్ష అనుభవంతోనే... కొత్తవలస సమీపంలోని మంగళపాలెం గ్రామంలో జన్మించాను. గతంలో మా నాయనమ్మకు ఇదే పరిస్థితి రావడంతో అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఆమె ఎన్నో బా«ధలు పడి, ఉన్నవాళ్లవద్ద ఇమడలేక, బయటకు వెళ్లలేక నరకం అనుభవించింది. ఉద్యోగరీత్యా స్థిరపడటంతో అలాంటి వాళ్లకు ఏదో విధంగా సేవ చేయాలన్న సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. ఆశ్రమానికి దాతలు, గ్రామస్తులు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారు. వీరే లేకపోతే నా సంకల్పం నెరవేరేదికాదు. - పొలమరశెట్టి ఆనందరావు, ఆశ్రమ వ్యవస్థాపకుడు . ఆత్మీయులు ఇక్కడే ఉన్నారు కుటుంబసభ్యులు చూడలేని పరిస్థితి కారణంగా ఈ ఆశ్రమానికి రావాల్సివచ్చింది. ఇక్కడకు వచ్చిన తర్వాత నా బాధలన్నీ మరిచిపోయి ఎంతో ఆనందంగా జీవించగలుగుతున్నాను. కన్నవారు లేకపోయినా ఓదార్చే వ్యక్తులు ఉండడం వలన ఉండగలుగుతున్నాను. – కరణం నిర్మల, తుమ్మపాల ఆశ్రమంలో అన్ని దక్కాయి... అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బయటకు పంపేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ ఆశ్రమానికి వచ్చా. ఆశ్రమంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎంతో హాయిగా ఉంటున్నాను. బాగా చూసుకుంటాను, రమ్మని నా కొడుకు పిలిచినా ఇప్పుడు వెళ్లను. వృద్ధాశ్రమం దేవాలయంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నాను. –సర్వలక్ష్మి, విజయరామరాజుపేట, అనకాపల్లిపట్టణం ఇంటి కన్నా ఆశ్రమమే బాగుంది ఇంట్లో నా కుటుంబసభ్యుల మధ్య ఉన్నప్పుడు ఎంతో నరకం చూశాను. సరైన వసతి, తిండి వంటి సౌకర్యాలతోపాటు ముఖ్యంగా ప్రశాంతత వంటివి లేక ఎంతో ఇబ్బందులు పడ్డాను. ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయాయి. మంచి భోజన సదుపాయం, మనశ్శాంతి కోసం ప్రార్ధనామందిరంతో ఏ చీకూ చింత లేకుండా ఆనందంగా ఉన్నాను. – పార్వతమ్మ, వృద్ధురాలు. కన్నోళ్లు చేయనివన్నీ ఆశ్రమం కల్పిస్తోంది కొడుకు, కోడలు చూడక ఇంత దూరం వచ్చాను. ఈ ఆశ్రమంలో మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాను. అన్నిసౌకర్యాలు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేవు. కన్నవాళ్ల గురించి మాట్లాడే కన్నా ఆశ్రమం గురించి ఎక్కువ మాట్లాడాలనిపిస్తోంది. ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. కన్నోళ్లు చేయని పరిస్థితి ఈ ఆశ్రమం చేస్తోంది. –గోపాలరావు, వృద్ధుడు