అనంతపురం సెంట్రల్ : అనంతపురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు కేరళ రాష్ట్రం కాసరగూడ జిల్లా పరవణదుక్కం ప్రభుత్వ ప్రత్యేక బాలసదనంలో ఆశ్రమం పొందుతున్నట్లు ఆ రాష్ట్ర అధికారుల నుంచి సమాచారం వచ్చిందని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, జిల్లా బాలల సంరక్షణాధికారి డాక్టర్ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నుంచి అక్కడ ఆశ్రయం పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ అబ్బాయి తన పేరు లక్ష్మన్ అలియాస్ ఆకాష్ అని, తన ఊరు హిందూపురం అని చెబుతున్నాడని తెలిపారు.
ఈ అబ్బాయి తల్లిదండ్రులు గానీ, సంబంధీకులు గానీ ఎవరైనా సదరు ఫొటో చూసి గుర్తు పడితే తగిన ఆధారాలు తీసుకుని ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో 30 రోజుల్లోగా సంప్రదించాలని కోరారు. ఎటువంటి సమాచారం అందకపోతే కేరళ రాష్ట్ర ప్రభుత్వం సదరు అబ్బాయిని అనాథగా ప్రకటించి అమలులో ఉన్న భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేరొకరికి దత్తత ఇస్తారని ప్రకటించారు.
కేరళ ఆశ్రమంలో ‘అనంత’ బాలుడు
Published Fri, Dec 9 2016 11:17 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement