సాక్షి, అమరావతి : కరోనావైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రికార్డ్ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. (చదవండి : కరోనా ఉగ్రరూపం: ఒక్క రోజే 465 మరణాలు)
కరోనా బారిన పడి ఈ రోజు 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 129కు చేరింది. ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. 4,779 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఏపీలో పాజిటివ్ శాతం 1.38కాగా, దేశంలో పాజిటివ్ శాతం 6.20గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment