సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో శనివారం సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడారు. సీఎం సూచన మేరకు రైతు బజార్లలోని కూరగాయల దుకాణాల సంఖ్యను పెంచుతామని, మొబైల్.. కూరగాయలు, నిత్యావసరాల దుకాణాలను ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఇంటింటా సర్వే చేస్తున్న వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులకు ఎన్–95 మాస్క్‌లు, ఇతర రక్షణ పరికరాలు ఇస్తామని చెప్పారు.
కేంద్ర మార్గదర్శకాల మేరకే లాక్ డౌన్ : మంత్రి బొత్స
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ జరుగుతోంది. రాష్ట్రంలో హార్టికల్చర్, ఆక్వా ఉత్ప త్తులకు నష్టం లేకుండా చూస్తాం.
- పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎ క్కువగా నమోదవుతున్న నేప థ్యం లో లాక్‌డౌన్‌ను మరింత పటి ష్టంగా అమలు చేస్తాం. పట్టణాల్లో ప్రతి ఇంటినీ సర్వే చేసి, అనుమా నిత లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాం.
రైతులకు నష్టం జరగనివ్వం: మంత్రి కె.కన్నబాబు
- రైతులు అరటి, మిరప, మామిడి పంటల ఉత్పత్తులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- అరటిని నిల్వ చేయడం కష్టం కాబట్టి సకాలంలో దానిని మార్కెట్ కు పంపించడంపై దృష్టి పెట్టాం.
- సామాజిక దూరం పాటించేలా చేస్తూ వ్యవసాయ పనులకు ఆటంకం లేకండా చూస్తాం.
104కు ఫోన్ చేయండి: పీవీ రమేష్
- వాసన, రుచి కోల్పోవడం, పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే 104 నంబర్ కు ఫోన్ చేస్తే, వైద్యులు వచ్చి పరీక్షిస్తారు. ఈ లక్షణాలు వచ్చిన వారిలో 80% మంది భయపడాల్సిన పని లేదు.
- ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా సీఎం నియమించారు. వారు ఆయా జిల్లాలకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment