
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని మొత్తం 74 కేసుల్లో ఆది, సోమవారాల్లోనే ఏకంగా 70 నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం కర్నూలులోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. మొత్తం 74 పాజిటివ్ కేసుల్లో 73 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే.
మిగిలిన ఒక వ్యక్తి (రైల్వే ఉద్యోగి) కూడా వారితో కలిసి రైలులో ప్రయాణించాడు. కాగా, జిల్లాలో 463 శాంపిల్స్‌కు గాను 393 రిపోర్టులు వచ్చాయి. మరో 70 రావాల్సి ఉంది. నిర్ధారణ పరీక్షల కోసం కర్నూలులోనే ల్యాబ్ ఏర్పాటుచేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. మరోవైపు.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను ప్రభుత్వం రెడ్‌జోన్‌లుగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment