సాక్షి, కర్నూలు: జిల్లాలో ప్రకటించిన రెడ్‌జోన్లలో మిని కోవిడ్-19 సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. (రెడ్‌జోన్ ప్రాంతాల్లో నాలుగో విడత సర్వే)
దీంతో జిల్లాలోని 3 వేలకుపైగా శాంపిల్స్‌ను కోవిడ్-19 పరీక్షలకు పంపించగా ఇందులో కొన్ని నెగిటవ్ వచ్చాయన్నారు. రాపిడ్ కిట్స్‌తో టెస్టులు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పడంతో వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. కాగా 37 ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అంతేగాక ప్రత్యేక ఫీవర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి ఒక మెడికల్ ఆఫిసర్‌ను కూడా నియమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ('ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి')
Comments
Please login to add a commentAdd a comment