సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తూ, ఈ వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో విజయం సాధించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం దక్కింది. భారత్‌లోలాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటిస్తూ కరోనాను కట్టడికి కృషి చేస్తున్న రాష్ట్రాలపై ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ సర్వే నిర్వహింది. ఈ సర్వేలో ఏపీ మొదటి స్థానంలో, కేరళ రెండో స్థానంలో నిలిచింది.
(చదవండి : ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు)
కరోనా వైరస్ కట్టడికి వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని, అందుకే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరగలేదని ఎన్డీ టీవి పేర్కొంది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసి కరోనా వైరస్ చైన్‌ను తెగగొట్టడంలో ఏపీ పెద్ద విజయం సాధించిందని ప్రశంసింది. ఎన్డీ టీవీ సర్వే వీడియోను మంత్రి పేర్ని నాని ట్వీట్ చేస్తూ ప్రజలను భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
(చదవండి : బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్ష)
కాగా, కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. సీఎం జగన్ ప్రతి రోజు సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా నుంచి రక్షణ కల్పిచేందుకు ప్రజల అందరికి మాస్కులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుంటుంబాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. అనారోగ్య లక్షణాలను ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నమోదవుతున్న కేసులు, కరోనా వ్యాప్తి చెందడానికి ఉన్న అవకాశాలను గుర్తించి జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. రైతు బజార్లు, మార్కెట్లలో ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
(చదవండి : అందరికీ మాస్కులు)
ఆంద్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కి చేరింది. ఇప్పటివరకు 12 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 413 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment