సాక్షి, అమరావతి: కరెన్సీ మార్పిడి వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా 2 వారాల పాటు కరెన్సీ వాడకాన్ని తగ్గించాలంటూ పోలీసు శాఖ ప్రకటన జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment