నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా పథకాల కింద రూ.995 కోట్లు మంజూరైనట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ కమిషనర్ ఇంతియాజ్‌తో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీకి రూ.520 కోట్లు, తాగునీటి పథకం కింద రూ.475 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరుకు కీలకపాత్ర వహించిన సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నెల్లూరు నగరం స్మార్ట్‌సిటీని తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు అబ్దుల్ జలీల్, బాలకోటేశ్వరరావు, వహిద, మామిడాల మధు, జహీర్, షంషుద్దీన్ ఉన్నారు.
కార్పొరేషన్‌కు రూ.995 కోట్లు మంజూరు
Published Sat, Apr 18 2015 3:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement