జమ్మికుంట,న్యూస్‌లైన్: వ్యాపార కేంద్రమైన జమ్మికుం టలో అవినీతి అక్రమాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అడ్డదారిలో సంపాదనకు మరిగిన వ్యాపారులు జీరో దందా తో సర్కారు ఆదాయానికి భారీగా గండి పెడుతున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుంటూ కళ్లు మూసుకుంటున్నారు. అవినీతి అధికారులు, అక్రమార్జనాపరులు ఒక్కటై సన్న రకం ధాన్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నారు.
అదే ధాన్యాన్ని భారీగా కొ నుగోలు చేస్తున్న వ్యాపారులు దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు. సన్న రకాన్ని రహస్య గోదాములకు తరలిస్తున్నారు. దానిని మరపట్టి బియ్యాన్ని దొంగచాటు గా అమ్ముకుంటున్నారు. సన్న రకం ధా న్యం పండించిన రైతుల వివరాలను బీరి జిస్టర్‌లో నమోదు చేయకుండా సాదాబుక్కులో నమోదు చేస్తున్నారు. మండలం లో ఈసారి రైతులు 2వేల ఎకరాల్లో సన్న రకం ధాన్యాన్ని పండించారు. అయితే మిల్లర్లు 5 వేల క్వింటాళ్ల ధాన్యాన్నే కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపుతున్నారు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని వ్యాపారులు రికార్డుల్లో చూపకపోవడమే కాకుండా రైతుల ఇళ్ల వద్ద, కల్లాల్లో కూడా భారీగా కొనుగోలు చేశారు. దీంతో పాటు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా సన్న రకం ధాన్యాన్ని ఇక్కడకు తెచ్చి అమ్ముతున్నారు. జిల్లాలోని పలు ప్రాం తాల నుంచే కాకుండా వరంగల్ జిల్లా పరకాల, చిట్యాల, మొగుళ్లపల్లి, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తదితర ప్రాంతాల నుంచి సన్న రకం ధాన్యం ప్రతిరోజూ జ మ్మికుంటకు వస్తోంది.
వివిధ ప్రాంతా ల్లో ఉండే దళారులు స్థానిక వ్యాపారుల తో లింకు పెట్టుకొని ప్రతి రోజూ ధాన్యా న్ని తెస్తున్నారు. ప్రతి ఏటా హుజూరాబా ద్ మండలం చెల్‌పూర్, రాజపల్లి, తోకల పల్లి, శాలపల్లి, ఇందిరానగర్‌కు చెందిన రైతులు నేరుగా సన్న రకాలను ఇక్కడి మిల్లుల్లో విక్రయిస్తున్నారు. కొనుగోళ్ల వివరాలను మార్కెట్ కార్యాలాయానికి తక్‌పట్టీల ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లు ఆ పని చేయడంలేదు. దీంతో అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని తెలుస్తోంది. మిల్లర్ల అక్రమ వ్యాపారంతో సర్కారుకు మార్కెట్ ఫీజే కాకుండా అమ్మకపు పన్ను 5 శాతం సై తం గండి పడుతోంది. నేరుగా జరిపే కొ నుగోళ్లతో బియ్యం తయారు చేసి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
జోరుగా జీరో దందా
Published Sat, Dec 14 2013 3:39 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement