శుక్రవారం జరిగిన ఉపాధి సామాజిక తనిఖీ బహిరంగ సభ
సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నిధుల లెక్క మారింది. రూ.1.17కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న వాస్తవ లెక్కలు శనివారం నివేదించారు. బి.కొత్తకోట మండలంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.36,72,910 దుర్వినియోగమైనట్లు శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగసభ తర్వాత అధికారులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు సభ జరగడంతో పూర్తిస్థాయి లెక్కలు తేలలేదు. దీనిపై సామాజిక తనిఖీ బృందం శనివారం రోజంతా లెక్కలు వేసి నివేదికలు సిద్ధం చేసింది.
ఆ వివరాల మేరకు..
బి.కొత్తకోట మండలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, అటవీశాఖ, సర్వశిక్ష అభియాన్, సెర్ప్ (వెలుగు) వాటర్‌షెడ్ పథకం ద్వారా రూ.6.70 కోట్ల నిధులను ఖర్చు చేశారు. ఇందులో సెర్ఫ్ (వెలుగు) ద్వారా మొక్కల పెంపకం కోసమే రూ.1,44 కోట్లు ఖర్చుచేసి చెల్లింపులు చేశారు. ఈ ని«ధుల వినియోగంపై వాస్తవాలను సామాజిక తనిఖీ బృందాలు నిగ్గుతేల్చాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి రూ.36.72 లక్షలు దుర్వి నియోగం అయినట్టు ప్రకటించారు. ఈ లెక్కలపై బృందం శనివారం పూర్తిగా సిద్ధం చేసింది. అందులో మొక్కల పెంపకం పేరులో వెలుగు సిబ్బంది రూ.80,51,445 నిధులను అక్రమాలబాట పట్టించినట్టు నిర్ధారించారు. పంచాయతీరాజ్‌శాఖ రూ.10,172, పశుసంవర్థకశాఖ రూ.4,15,546, గృహ నిర్మాణ శాఖ రూ.1,61,712, ఉపాధి పథకంలో రూ.30,93,281, అటవీశాఖ రూ.14,158 నిధులు అవినీతి దారిపట్టిందని తేల్చారు. సామాజిక తనిఖీ బృందం నివేదించిన అక్రమాల చిట్టాను సమీక్షించి, సిబ్బంది పనితీరు, పనులపై అధికా రులు, సిబ్బంది ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేశారో çసభలోనే స్పష్టం చేశారు.
దీనిపై ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చర్యలకు ఆదేశాలి చ్చారు. అందులో సెర్ప్ (వెలుగు) సిబ్బంది నుంచి రూ.41,14,514 నిధులు రికవరీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ నుంచి రూ.10,172 నిధులను రికవరీ చేసి మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ నుంచి రూ.46,500 నిధులు రికవరీ చేసి, మిగిలిన నిధులకు సంబంధించి గడ్డి పెంపకం, మల్బరీసాగు చేపట్టేలా సూచనలిచ్చారు. గృహనిర్మాణ శాఖ నుంచి రూ.34వేలు రికవరీ చేస్తూ, మిగిలిన నిధులకు సంబం ధించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా ఆదేశాలిచ్చారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.3,04,512 నిధులను రికవరీకి ఆదేశించి మిగిలిన నిధులను నిలుపుదల చేశారు. అటవీ శాఖకు సంబంధించి మిగిలిన పనులు, మొక్కల పెంపకం చేపట్టాల ని ఆదేశించారు. రూ.1.17కోట్ల నిధులు దుర్విని యోగమైనట్లు తేలగా రూ.45,09,698 వసూలుకు చర్యలు తీసుకున్నారు.
నిధుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసు
ఉపాధి నిధుల దుర్వినియోగం వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులు పెద్దస్థాయిలో దుర్వినియోగం అయిన విషయం శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభలో వెల్లడైన విషయం తెలిసిందే. మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ వేమిలేటికోటకు చెందిన మహిళా రైతు ఎం.ధనలక్ష్మికి సర్వే నంబర్ 938/సీ–5లో 3.42 ఎకరాల పొలం ఉందని 28–6–2017న అంచనా వేశారు. 24–7–17 నుంచి 5–1–2019 మధ్యకాలంలో 239 గుంతలు తీసి మామిడి మొక్కలు నాటినట్టు 13038 నంబర్‌తో సీసీ ఎంబుక్ చేశారు. పేజీ నంబర్ 1 నుంచి 22 వరకు ఈ పనికి సంబంధించిన వివరాలు నమోదు చేసి బిల్లులు చెల్లించారు.
అయితే సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ పనిని వీఓఏ, రైతు సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలించగా అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి. నిధులు మంజూ రు చేసిన పొలంలో గుంతలు తవ్విన, మొక్కలు నాటిన ఆనవాళ్లు కనిపించలేదు. రైతు ధనలక్ష్మికి పెద్దతిప్పసముద్రం మండలంలో పొలం ఉన్నట్టు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఇలా భూమిని మార్చి 2017–18లో రూ.68,055, 2018–19లో 35,621 కలిపి మొత్తం రూ.1,63,676 చెల్లించారని తనిఖీ సిబ్బంది గుర్తించి నివేదించారు. దీన్ని పరిశీలించిన ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చెల్లించిన మొత్తం నిధులు 100శాతం రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు. బాద్యులపై చర్యలు తీసుకో వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment