Plants program
-
పల్లె ప్రకృతి వనంలో 116 రకాల మొక్కలు
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రకృతి వనాలు ఆయా గ్రామాల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎకరా విస్తీర్ణంలో గతేడాది ఆగస్టులో ప్రారంభించిన పల్లె ప్రకృతి వనంలో భాగంగా 5 వేలు నాటగా, ఇప్పుడవి ఫలాలను అందించే వనంగా తయారయ్యాయి. 40 రకాల పండ్ల మొక్కలతో పాటు, పూల మొక్కలు, 30 రకాల ఔషధ గుణాలు గల మొక్కలను పెంచుతున్నారు. ఆదర్శంగా ఉన్న ఈ ప్రకృతి వనాన్ని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. వనంలో అరుదైన మొక్కలు చాలా వరకు కనుమరుగైన మొక్కలు ఈ వనంలో పెంచుతున్నారు. సీమరూబ, ఆకాశమల్లె, రామఫల్, లక్ష్మణఫల్, చెన్నంగి, అశ్వగంధ, సంపెంగ, నూరు వరహాలు, నంది వర్ధనం, గచ్చకాయ, పసరుగణి, దేవగన్నేరు, సీమచింత, సీమరుబ్బ, సింగపూర్ చెర్రి, తుబూలియా హాలండియా, నెమలినార, గంగరావి, బుడ్డ ధరణి, లెమన్‌గ్రాస్.. ఇలాంటి అరుదైన రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ అధికారుల తోడ్పాటుతో వనం పచ్చదనంతో సుందరవనంగా చూపరులను ఆకట్టుకుంటుంది. పల్లె ప్రకృతి వనంలో గ్రామం ప్రత్యేకం పల్లెవనంలో పెంచుతున్న మొక్కలను స్వయంగా వివిధ నర్సరీలలో కొనుగోలు చేసి వాటిని ఈ వనంలో పెంచుతున్నాం. ప్రత్యేకంగా 116 వెరైటీ మొక్కలు పెంచడంతో ఆదర్శంగా నిలుస్తున్నాం. గ్రామస్తుల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి కనుమరుగైన మొక్కల గురించి తెలుసుకుంటున్నారు. ఈ వనంతో గుర్తింపు రావడంతో గర్వంగా ఉంది. – సాదీజాబేగం, కులబ్గూర్ సర్పంచ్ ఔషధ గుణాల మొక్కలతో ఉపయోగం ప్రస్తుత కాలంలో ఔషధ గుణాల మొక్కలతో ఉపయోగం ఉంటుంది. స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. పార్కుల్లో ఇలాంటి మొక్కలు పెట్టడంతో ఆహ్లాద వాతావరణంతో పాటు ఆక్సిజన్ లభిస్తుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కనుమరుగైన మొక్కలను భావితరాలకు తెలియజేయడానికి మావంతు కృషి చేశాం. రాగి, మర్రి, తులసి ఇతర మొక్కల ద్వారా ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది. – మహేందర్‌రెడ్డి, ఎంపీఓ -
మెక్కింది రూ.1.17 కోట్లు!
సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగమైన నిధుల లెక్క మారింది. రూ.1.17కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న వాస్తవ లెక్కలు శనివారం నివేదించారు. బి.కొత్తకోట మండలంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.36,72,910 దుర్వినియోగమైనట్లు శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగసభ తర్వాత అధికారులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు సభ జరగడంతో పూర్తిస్థాయి లెక్కలు తేలలేదు. దీనిపై సామాజిక తనిఖీ బృందం శనివారం రోజంతా లెక్కలు వేసి నివేదికలు సిద్ధం చేసింది. ఆ వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, అటవీశాఖ, సర్వశిక్ష అభియాన్, సెర్ప్ (వెలుగు) వాటర్‌షెడ్ పథకం ద్వారా రూ.6.70 కోట్ల నిధులను ఖర్చు చేశారు. ఇందులో సెర్ఫ్ (వెలుగు) ద్వారా మొక్కల పెంపకం కోసమే రూ.1,44 కోట్లు ఖర్చుచేసి చెల్లింపులు చేశారు. ఈ ని«ధుల వినియోగంపై వాస్తవాలను సామాజిక తనిఖీ బృందాలు నిగ్గుతేల్చాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి రూ.36.72 లక్షలు దుర్వి నియోగం అయినట్టు ప్రకటించారు. ఈ లెక్కలపై బృందం శనివారం పూర్తిగా సిద్ధం చేసింది. అందులో మొక్కల పెంపకం పేరులో వెలుగు సిబ్బంది రూ.80,51,445 నిధులను అక్రమాలబాట పట్టించినట్టు నిర్ధారించారు. పంచాయతీరాజ్‌శాఖ రూ.10,172, పశుసంవర్థకశాఖ రూ.4,15,546, గృహ నిర్మాణ శాఖ రూ.1,61,712, ఉపాధి పథకంలో రూ.30,93,281, అటవీశాఖ రూ.14,158 నిధులు అవినీతి దారిపట్టిందని తేల్చారు. సామాజిక తనిఖీ బృందం నివేదించిన అక్రమాల చిట్టాను సమీక్షించి, సిబ్బంది పనితీరు, పనులపై అధికా రులు, సిబ్బంది ఏమేరకు చిత్తశుద్ధితో పనిచేశారో çసభలోనే స్పష్టం చేశారు. దీనిపై ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చర్యలకు ఆదేశాలి చ్చారు. అందులో సెర్ప్ (వెలుగు) సిబ్బంది నుంచి రూ.41,14,514 నిధులు రికవరీ చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ నుంచి రూ.10,172 నిధులను రికవరీ చేసి మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ నుంచి రూ.46,500 నిధులు రికవరీ చేసి, మిగిలిన నిధులకు సంబంధించి గడ్డి పెంపకం, మల్బరీసాగు చేపట్టేలా సూచనలిచ్చారు. గృహనిర్మాణ శాఖ నుంచి రూ.34వేలు రికవరీ చేస్తూ, మిగిలిన నిధులకు సంబం ధించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా ఆదేశాలిచ్చారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.3,04,512 నిధులను రికవరీకి ఆదేశించి మిగిలిన నిధులను నిలుపుదల చేశారు. అటవీ శాఖకు సంబంధించి మిగిలిన పనులు, మొక్కల పెంపకం చేపట్టాల ని ఆదేశించారు. రూ.1.17కోట్ల నిధులు దుర్విని యోగమైనట్లు తేలగా రూ.45,09,698 వసూలుకు చర్యలు తీసుకున్నారు. నిధుల దుర్వినియోగంపై క్రిమినల్ కేసు ఉపాధి నిధుల దుర్వినియోగం వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో ఉపాధి నిధులు పెద్దస్థాయిలో దుర్వినియోగం అయిన విషయం శుక్రవారం జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభలో వెల్లడైన విషయం తెలిసిందే. మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ వేమిలేటికోటకు చెందిన మహిళా రైతు ఎం.ధనలక్ష్మికి సర్వే నంబర్ 938/సీ–5లో 3.42 ఎకరాల పొలం ఉందని 28–6–2017న అంచనా వేశారు. 24–7–17 నుంచి 5–1–2019 మధ్యకాలంలో 239 గుంతలు తీసి మామిడి మొక్కలు నాటినట్టు 13038 నంబర్‌తో సీసీ ఎంబుక్ చేశారు. పేజీ నంబర్ 1 నుంచి 22 వరకు ఈ పనికి సంబంధించిన వివరాలు నమోదు చేసి బిల్లులు చెల్లించారు. అయితే సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ పనిని వీఓఏ, రైతు సమక్షంలో క్షేత్రస్థాయిలో పరిశీలించగా అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి. నిధులు మంజూ రు చేసిన పొలంలో గుంతలు తవ్విన, మొక్కలు నాటిన ఆనవాళ్లు కనిపించలేదు. రైతు ధనలక్ష్మికి పెద్దతిప్పసముద్రం మండలంలో పొలం ఉన్నట్టు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఇలా భూమిని మార్చి 2017–18లో రూ.68,055, 2018–19లో 35,621 కలిపి మొత్తం రూ.1,63,676 చెల్లించారని తనిఖీ సిబ్బంది గుర్తించి నివేదించారు. దీన్ని పరిశీలించిన ఏపీడీ శ్రీనివాసప్రసాద్ చెల్లించిన మొత్తం నిధులు 100శాతం రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు. బాద్యులపై చర్యలు తీసుకో వాలన్నారు. -
హరితోత్సవం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పల్లెలు పచ్చలహారం వేసుకోవాలి.. పట్టణాలు పచ్చని మొక్కలతో వనాలుగా మారాలి.. భవిష్యత్ తరాలు ‘హరితహారం’తో మురిసిపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా మొక్కవోని సంకల్పంతో రాష్ట్రం మొత్తాన్ని పచ్చని హారంలా మార్చేందుకు మొక్కలు నాటడాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఈ ఏడాది ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా లక్ష్యాలను నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే శాఖలవారీగా లక్ష్యాలను కూడా అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పూలు, పండ్లతోపాటు రైతులకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండడంతో వర్షాలు పడిన అనంతరం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంపై నాటాల్సిన మొక్కలపై లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో జిల్లాకు 3.30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టారు. అందుకు అనుగుణంగా అధికారులు మొక్కల పెంపకాన్ని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఏడాది జూలై నెలలో హరితహారం కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాది కూడా వర్షాలు పడిన తర్వాత జూలైలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులకు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడెక్కడ నాటాలనే దానిపై వివరిస్తున్నారు. లక్ష్యం 3.30 కోట్ల మొక్కలు.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలలో 3.95 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖాళీ స్థలాల్లో.. జిల్లాలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగానే ఆయా శాఖల ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. గృహ అవసరాల కోసం కూడా మొక్కలను అందజేయనున్నారు. అలాగే విద్యా సంస్థలు, వసతి గృహాలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పారిశ్రామిక కేంద్రాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని విద్యా సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, వివిధ పరిశ్రమ కేంద్రాల బాధ్యులను అధిక మొత్తంలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట, చెరువు గట్లపై నాటే మొక్కలను అవసరాలకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధంగా ఉంచనున్నారు. మొక్కలు నాటిన అనంతరం ఆయా మొక్కల సంరక్షణను కూడా చేపట్టనున్నారు. ఏమైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు అదనంగా మొక్కలను సిద్ధంగా ఉంచుతున్నారు. సంరక్షణే ప్రధాన ధ్యేయం.. జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు హరితహారం కింద నాటే మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించి.. అవగాహన కల్పించనున్నాం. మొక్కలు నాటడం ఒక లక్ష్యం కాగా.. సంరక్షించడం మరో ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం. మా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. మిగితా వారికి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. మొక్కలు నాటే ప్రాధాన్యతను వివరించనున్నాం. – బి.ప్రవీణ, జిల్లా అటవీ శాఖాధికారి, ఖమ్మం -
పార్టీ ఫండ్ ఇస్తే ఓకేనా?
ఏ చిన్నపాటి పనిచేసినా నాకెంత మిగులుతుంది.. అని లెక్కలు వేసుకుని పనులు చేసే ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు ఇటీవల మొక్కల నాటే కార్యక్రమం పేరిట లక్షలాది రూపాయలు మింగేశారట. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ బాగోతాన్ని పరిశీలిస్తే... పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం కింద నగరంలోని అన్ని డివిజన్లలోనూ మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ఆ కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి 10వేల మొక్కలు రప్పించి డివిజన్‌కు 200 చొప్పున 50 డివిజన్లలో పంపిణీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా సదరు మొక్కల పంపిణీ జమా ఖర్చుల్లోనే సంబంధిత అధికారులు మాయాజాలం చేశారట. వాస్తవానికి ఒక్కో మొక్కకు రూ.5 చొప్పున రూ.50వేలు ఖర్చు కాగా, అధికారులు మాత్రం మొక్కకు 20 రూపాయల చొప్పున రూ.2 లక్షలకు బిల్లు చూపించేశారట. అంటే రూ.లక్షన్నర నొక్కేశారన్నమాట. పచ్చదనం వెల్లివిరిసేందుకు ప్రభుత్వం చేపట్టిన చిన్నపాటి మొక్కలు నాటే కార్యక్రమంలోనే లక్షలు బొక్కేస్తే నగరపాలక సంస్థలో అవినీతి ఏస్థాయిలో వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. ‘మాకు డబ్బు మీద ఆశలేదు.. బాగా చేశామని పేరొస్తే చాలు’ అని పదే పదే చెప్పుకుంటున్న పాలకులు ముందుగా నగరపాలక సంస్థను పట్టిపీడిస్తున్న అవినీతి, అక్రమాలపై దృష్టి పెడతారా.. ఏమో చూద్దాం. పార్టీ ఫండ్ ఇస్తే ఓకేనా? అధికార తెలుగుదేశం, మిత్రపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించిన బీజేపీ వచ్చే నెల నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టేం దుకు సన్నాహాలు చేస్తోంది. టీడీపీ అధిష్టానం సభ్యత్వ నమోదుకు నామినేటెడ్ పదవుల పందేరంతో ముడిపెట్టడంతో పార్టీ శ్రేణులు ఈ పనిని విచ్చలవిడిగా చేసేస్తున్నాయి. ఒక్కో సభ్యత్వానికి రూ.వంద తీసుకుంటూ రూ.2 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇలా తాయిలాలతో సభ్యత్వ నమోదును తారస్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ నేతలు ‘మా పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే చాలు.. మీరేం చేసినా మేముంటాం’ అని భరోసా ఇస్తున్నారట. ‘చివరకు తప్పు చేసినా సరే..’ అన్న భావనను కల్పిస్తున్నారట. ఇందుకు ఇటీవల ఏలూరులో చోటుచేసుకున్న ఆటోనగర్ వివాదాన్ని కొందరు నేతలు ఉదాహ రణగా ఉటంకిస్తున్నారు. నగరంలో నెల రోజులుగా ఆటోనగర్ స్థలాలపై వివాదం నలుగుతున్న సంగతి తెలి సిందే. అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణం ఇంటికి పోలీ సులు సోదాలకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు కట్టకట్టుకుని అక్కడ వాలారు. వారంతా మాగంటికి బహిరంగంగా మద్దతివ్వడానికి బలమైన కార ణం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల జరి గిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆటోనగర్ పెద్దలు తెలుగుదేశం పార్టీకి రూ.40 లక్షల్ని ఫండ్ ఇచ్చారట. కేవలం ఆ కృతజ్ఞతతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వ యంగా ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించారని అంటున్నారు. అంతేనా.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్‌ను కూడా అడ్డుకున్నారన్న ప్రచారముంది. అంటే అధికార పార్టీకి ఫండ్ ఇస్తే.. తప్పు చేసినా మీ వెనుక మేముంటాం అనే సంకేతాల్ని నేతలు క్యాడర్‌కు అందించారని అంటున్నారు. ప్రజలూ.. చూస్తున్నారా ఈ విడ్డూరం. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు