నెల్లూరు (టౌన్ ), న్యూస్‌లైన్ : విద్యాశాఖలో అక్రమార్కులపై వేటు పడింది. మెడికల్ రీయింబర్‌స మెంట్ వ్యవహారంలో దొంగబిల్లులు సమర్పించిన 29 మంది ఉపాధ్యాయులు, ఒక డీడీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్, రాష్ర్ట డెరైక్టరేట్ అధికారులు డీఈఓ కార్యాలయానికి బుధవారం రాత్రి మెయిల్ పంపారు. దీంతో జిల్లాలో ఉపాధ్యాయుల అవినీతి బాగోతం బయటపడింది.
ఈ విషయం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. జిల్లా విద్యాశాఖ అవినీతి, అక్రమాలకు నిలయమైందని కొన్నేళ్లుగా ఆరోపణలు న్నాయి. సస్పెన్షన్ వేటు పడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. వివరాల్లోకి వెళితే... 2009-11 మధ్య కాలం లో మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో రాష్ట్రంలోనే పెద్ద రాకెట్ కేం ద్రం నడిచింది. ప్రధానంగా నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. ఈ వ్యవహారం నల్గొండ జిల్లా లో ముదిరి పాకాన పడింది.
అప్పట్లో డీఈఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు నల్గొండలో తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఈ దొంగ బిల్లుల వ్యవహారం వెలుగుచూసింది. అకౌంట్ జనరల్(ఏజీ) కార్యాలయం ఈ బిల్లులను స్క్రూటినీ చేసింది. వారికి అనుమానం వచ్చి నేరుగా ఆస్పత్రులకు వెళ్లి పరిశీలించగా వైద్యం హుళక్కే అని తేలింది.
అంతేకాక స్టాంపులు, ఇతరత్రా అంతా దొంగ వ్యవహారమే అని నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని వేసి అన్ని జిల్లాల్లో విచారించాలని ఆదేశించింది.మూడేళ్ల క్రితం డీఈఓతో కుమ్మక్కై పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల దగ్గరి బంధువులు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పేరుతో దొంగ బిల్లులు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని విచారణకు ఆదేశించింది. కమిటీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. దీని ప్రకారంగా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి భార్య, గతం లో ఇక్కడ ఏడీగా పనిచేసి పదోన్నతిపై హైదరాబాద్‌కు డిప్యూ టీ డెరైక్టర్‌గా బదిలీ అయిన మరొక మహిళ ఉన్నారు. వీరితో పాటు మరో 28 మంది టీచర్లు కూడా ఊబిలో చిక్కుకున్నారు.
అవినీతికి చిరునామాగా జిల్లా విద్యాశాఖ
Published Thu, Jun 5 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement