నెల్లూరు: శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్‌లో జీఎస్ఎల్వీ డీ-5 రాకెట్ ప్రయోగానికి శనివారం కౌంట్డౌన్ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.18గంటలకు జీఎస్ఎల్వీ డీ-5 నింగికెగరనుంది. జీ శాట్ -14 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు జీఎస్ఎల్వీ డీ-5 రాకెట్ సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం ద్వారా టెలీఎడ్యుకేషన్, టెలీమెడిసిన్ సేవలను జీ శాట్ - 14 అందించనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
ఈ ఏడాది అంతరిక్షంలోకి మొట్టమొదటి సాటిలైట్ జీ శాట్ -14 వెళ్లనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. జీఎస్ఎల్వీ ప్రయోగంలో మూడు వరుస వైఫల్యాల తర్వాత జీఎస్ఎల్వీ డీ-5 మొదటి ప్రయోగమని వారు పేర్కొన్నారు. క్రయోజనిక్ ఇంజిన్‌లతో జీఎస్ఎల్వీ డీ-5ను భారత్ సొంతంగా తయారు చేయడం విశేషం.