కడప డెస్క్ :కరోనా సవాలుకు సమాధానం చెప్పాలని ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. ఇందులో భాగంగానే మన ప్రధానమంత్రి నరేంద్రమోది గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా వల్ల ఏర్పడనున్న ముప్పును తెలియజేస్తూ అప్రమత్తమే దీనికి తగిన మందు అని చెప్పకనే చెప్పారు. 14 గంటల పాటు అందరూ ఆదివారం ఇళ్లకు పరిమితం కావాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూకు అందరూ సహకరించాలని కోరారు. కానీ ఇంతసేపు ఇంటినుంచి బయటకు రాకుండా ఉండటమెలా..కనీస అవసరాలు మరి ఎలా తీరుతాయి..చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న..దీనికి సామాజిక మాధ్యమాల్లో చాలామంది పలు సూచనలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇదేమంత కష్టం కాదంటున్నారు. దేశం కోసం..మనందరి ఆరోగ్యం కోసం ప్రధాని పిలుపును అనుసరిద్దామంటున్నారు.
ముందస్తు ప్రణాలిక ఇలా..
♦ శనివారం నాడే అదివారానికి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
♦ రెండు రోజులకి సరిపడా కాయకూరలు..వంటకు అవసరమైన సామగ్రి కొనండి.
♦ అవుసరమైన మందులు ఉన్నాయా లేవో చూసుకొని ఒకవేళ లేకపోతే శనివారం అంటే ముందురోజే తెచ్చుకోండి.
♦ పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి. అప్పటికప్పుడు కావాలంటే చిరు దుకాణాలు కూడా మూసి ఉంటాయి. పిల్లల్ని ఓదార్చడం కష్టం. అందుకే ఇది ముఖ్యం..
♦ ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతే శనివారం పూర్తి చెయ్యండి.
♦ ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
♦ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి. ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది.
♦ శుబ్రం చేసేముందు ముక్కుకు రక్షణగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి..మాస్కులు ధరించడం మరిచిపోకండి. ఇంట్లో కూడా కాస్త ఎడంగానే మసలడం మేలంటున్నారు నెటిజన్లు.
♦ పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒక స్ట్రిప్ దగ్గర ఉంచుకోండి. అంతేకాదు ఇంట్లో అంతకుముందే వాడుతున్న బీపీ..షుగర్‌లాంటి మాత్రలు అయిపోయి ఉంటే ముందుగా కొనండి
♦ డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
♦ బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
♦ సాత్వికాహారం తినండి. కొత్తగా ఆరోగ్య సమస్యలను ఆహ్వానించకండి..ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
♦ సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు మీ ఇంటిగేటు వద్ద నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
♦ తర్వాత ఇక చెప్పేదేముంది. హాయిగా టీవీ కార్యక్రమాలతో వినోదం పొందండి.
♦ జనతా కర్ఫ్యూ విజయ వంతం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment