
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1016కు చేరింది. వీరిలో మొత్తం 171 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 31 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, క్రిష్ణాలో 25, కర్నూలులో 14, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.
రాష్ట్రంలో కొత్తగా డిశ్చార్జ్ అయిన వారి వివరాలు
గడిచిన 24 గంటల్లో 26 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశంలో 11, తూర్పు గోదావరిలో 4, కృష్ణలో 4, కర్నూలులో 3, అనంతపూర్, నెల్లూరులో ఇద్దరి చొప్పున డిశ్చార్జ్ అయ్యారు.
కొత్తగా నమోదైన మరణాలు
రాష్ట్రంలో కొత్తగా కర్నూలులో ఒకరు, కృష్ణలో ఒకరు కోవిడ్‌తో మరణించారు.
****గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్ పరీక్షలు- 6928. వీరిలో 61 మందికి పాజిటివ్‌గా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment