అనాథలా మారిన పెద్దాసుపత్రి
సీపీఎం నేతల బృందం ఆవేదన
అధికారులు స్పందించకపోతే ఉద్యమం
జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద చికిత్స పొందే రోగులకు కూడా పూర్తిస్థాయిలో మందులు ఇవ్వడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి క్యాజువాలిటి, బూత్‌బం గ్లా, సర్జికల్, మెడికల్ వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పలువురు వైద్యులు, నర్సులు, రోగులతో మాట్లాడారు. చివరగా సమస్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామితో చర్చించా రు. అనంతరం ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ నాలుగు జిల్లాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనాథగా మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో దూది కూడా లేదంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రికి 564 రకాల మందులు అవసరమైతే అందులో 50 శాతం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. అత్యవసర మందుల పంపిణీలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న రోగులు కూడా ప్రైవేటుగా మం దులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వార్డుబాయ్‌ల కొరత వేధిస్తోందన్నారు. ఒకేచోట మందులు సరఫరా చేయడం వల్ల గంటల తరబడి రోగులు క్యూలో నిలబడాల్సి వస్తోంద న్నారు.
అదనంగా నాలు గు కౌంటర్లు పెట్టి మందులు సరఫ రా చేయాలన్నారు. మూడు నెలల కోసారి జరగాల్సిన ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశం ఏడాదైనా నిర్వహించకపోవడం దారుణమన్నారు. ఆసుపత్రిని నిమ్స్, టిమ్స్‌గా మారుస్తామన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్, నగర నాయకులు పుల్లారెడ్డి, పి. నిర్మల, టి. రాముడు, ఎం. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.