హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కమిటీ శనివారమిక్కడ సమావేశమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారాం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి ఖమ్మం జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.