'రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం' | CPM supports ysrcp bundh on august 29th | Sakshi
Sakshi News home page

'రాజధాని పేరుతో చంద్రబాబు వ్యాపారం'

Published Wed, Aug 26 2015 12:23 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CPM supports ysrcp bundh on august 29th

నెల్లూరు: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాపారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఆయన బుధవారం నెల్లూరులో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టారని, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మరోసారి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ప్రజల సంక్షేమం కంటే తన స్వార్థ ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29 న వైఎస్ఆర్ సీపీ చేపట్టిన బంద్ కు వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయని మధు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement