తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెంలో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటన జిల్లా సరిహద్దునే చోటుచేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డతీగల, వై.రామవరం ప్రధాన రహదారిలో చిన్న వంతెనలు, అనుమానాస్పద ప్రదేశాల్లో జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు సరిహద్దు దాటి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.