చి‘వరి’కి మిగిలింది అప్పులే !
విజయనగరం వ్యవసాయం : ఆరుగాలం శ్రమించి పం డించిన రైతులకు మిగింది అప్పులే. ఆదాయం మాట అటుంచితే అన్నదాతలు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.ఖరీఫ్‌లో సాగుచేసిన వరి కో తలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోటి ఆశలతో నూర్పులు ప్రారంభించారు. అయితే దిగుబడి చూసి రైతులు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. మొదట వర్షాభావ పరిస్థితులు, తరువాత హుద్‌హుద్ తుపాను, దోమకా టు వంటి తెగుళ్లు వ్యాపించడంతో వరి దిగుబడి బాగా తగ్గిపోయింది. పెట్టుబడికి కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు.
ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 1,20,454 హెక్టార్లు కాగా, జిల్లాలో ఈ ఏ డాది 1,18,252 హెక్టార్లలో సాగు అయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరి కోతలు, మోతలు, నూర్పులు జరుగుతున్నాయి. దాదపు 60 శాతం కోతలు పూర్తయ్యాయి. 30 శాతం మంది నూర్పులు ప్రారంభించా రు. ఎకరం పొలంలో వరిని పండించడానికి రూ. 21 వేల వరకూ ఖర్చు అయితే రైతుకు రూ. 18 వేలకు మిం చి ఆదాయం రావడం లేదు. ఎకరానికి 18 నుంచి 20 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. ఈ లెక్కన ఎకరాకి రూ.16 వేల నుంచి రూ. 18 వేలు మాత్రమే ఆదాయం లభిస్తోంది.
అప్పుల పాలు
వర్షభావం, తుపాను వంటి వైపరీత్యాలను ఎదుర్కొని రైతులు సాగు చేశారు. అయినా ఫలితం లేకుండా పో యింది. ఈ ఏడాది ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయిం ది. పెట్టినపెట్టుబడులు కూడా రాలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గంలేకుండా పోయింది. కష్టం పోయి, పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధర పెంచాలి
ప్రస్తుతం 75 కేజీల బస్తాకు ప్రభుత్వం రూ.1000 మద్దతు ధర ప్రకటించింది. అయితే రైతులకు రూ. 900 కు మించి రావడం లేదు. పొల్లు,మట్టి ఉందని వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ. 900కు మించి ఇవ్వడం లేదు. పెరిగిన పెట్టుబడులకు ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న మద్దతు ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు. 75 కేజీల బస్తాకు రూ.1500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
నాపేరు సిరపురపు ఎర్నాయుడు. మాది గంట్యాడ మం డలం పెదవేమలి. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ఎకరం పొ లంలో 1001రకం, మరో ఎకరం పొలంలో సోనామసూరి వేశాను. కోత కోసి, నూర్పు కూడా చేశాను. రెండు ఎకరాలు కలపి 38 బస్తాలు వచ్చాయి. రెండు ఎకరాలు సాగుకు రూ.42 వేలు ఖర్చు అయింది. నాకు రెండు ఎకరాలకు కలిపి పెట్టుబడి కూడా రాలేదు. తిరిగి అప్పుల అయ్యాను. 75 కేజీల బస్తాకు మద్దతు ధర రూ.1500 ఇస్తేగాని గిట్టుబాటు కాదు.
నా పేరు కె.రాము. మాది గుంకలాం. నాకు ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంలో 1001 ర కం వరి సాగు చేశాను. నూర్పు చే యగా 20 బస్తాలు వచ్చాయి. బస్తా కు రూ.900 చొప్పున రూ.18 వేలు ఆదాయం ల భించింది. పెట్టుబడికి రూ. 22 వేలు ఖర్చు అయిం ది. ఇంకా రూ. 4 వేలు అప్పు అయ్యాను. ధర రూ. 1,500 కు పెంచితేగాని గిట్టుబాటు కాదు.