విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ 'మదీ' తుపాను ప్రభావం రాష్ట్రంపై మరో రెండు రోజుల పాటు ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రా తీరంలో గాలుల ఉధృతి 60 కిలోమీటర్ల వేగానికి పెరిగాయి. మదీ తుపాను క్రమేపి బలహీనపడుతూ చెన్నైకి ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది.ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.