Madi cyclone
-
బలహీనపడుతున్న 'మాది' తుపాను
విశాఖపట్నం: 'మాది' తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన మాది తుపాను రేపటికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీని ప్రభావం వల్ల రాగల 48గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తుపాను ప్రభావంతో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరంలో అలల ఉధృతి ఎక్కువ ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
బలహీనపడిన మాదీ తుపాను.. తూర్పుగోదావరిలో బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మాదీ' తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మాదీ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో సముద్రం 100 మీటర్లు ముందుకొచ్చింది. 30 పూరిళ్లు నేలమట్టం అయ్యాయి. అలాగే, ఈ తుపాను ఒడిషా తీరంలోని గోపాల్పూర్ తీరానికి దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఈశాన్యంగా 480 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైందని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది దక్షిణ నైరుతి దిశగా కదిలి, ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. -
మరో 2 రోజులపాటు మదీ తుపాను ప్రభావం
విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ 'మదీ' తుపాను ప్రభావం రాష్ట్రంపై మరో రెండు రోజుల పాటు ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రా తీరంలో గాలుల ఉధృతి 60 కిలోమీటర్ల వేగానికి పెరిగాయి. మదీ తుపాను క్రమేపి బలహీనపడుతూ చెన్నైకి ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉంది.ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
చెన్నైకి తూర్పుదిశగా.. కేంద్రీకృతమైన `మాదీ` తుపాను
విశాఖపట్నం: చెన్నైకి తూర్పుదిశగా 490కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను `మాదీ` కేంద్రీకృతమైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మాదీ తుపాను ఉత్తరదిశగా కదులుతున్నట్టు పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో బలహీనపడి.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలుకురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పోర్టుల్లో అధికారులు 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
అతి తీవ్ర తుఫాన్‌గా మారిన 'మాదీ'
విశాఖ:నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఏర్పడిన మాదీ తుపాను అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మాదీ తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశగా పయనిస్తుందని తెలిపింది. దీంతో అన్ని ఓడరేవులలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్యకారులు వేట వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ముంచుకొస్తున్న ‘మాదీ’
సాక్షి, విశాఖపట్నం: మరో ముప్పు ముంచుకువస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న వాయుగుండం శనివారం ఉదయం నాటికి తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణశాఖ అధికారులు ‘మాదీ’గా నామకరణం చేశారు. మాల్దీవుల వాతావరణ విభాగం ఈ పేరును నిర్ణయించింది. రానున్న 24గంటల్లో మాదీ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఐదు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల క్రితం వరకూ వాయుగుండంగానే ఉంది. శుక్రవారం రాత్రి నాటికి తీవ్రవాయుగుండంగా మారి 24 గంటలు దాటక ముందే తుపానుగా మారింది. ‘మాదీ’ బలపడితే.. మాదీ తుపాను శనివారం సాయంత్రానికి చెన్నైకు ఆగ్నేయంగా 500 కి.మీ. దూరంలో ఉంది. కోస్తా తీరానికి మాత్రం 300 నుంచి 400కి.మీ. దూరంలో ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో ఇది కదలడం లేదని, అందువల్లే ఎక్కడ తీరం దాటుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు తీవ్ర గాలులు వీస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు వచ్చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ‘మాదీ’ గత తుపాన్ల కంటే భీకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఎలా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూస్తే గానీ చెప్పలేమంటున్నారు. నవంబర్ 28న తీరం దాటిన లెహర్ తుపాను ప్రభావం సన్నగిల్లింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో తుపాను రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. మాదీ తుపాను ప్రస్తుతం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ. దూరంలో ఉంది. మత్స్యకారులు సముద్రం లోతు వరకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఉత్తర దిశగా, మెల్లగా పయనిస్తున్నట్టు అంచనా వేశారు. -
ఈసారి ‘మాది’ గండం!
= పొంచి ఉన్న మరో తుపాను = 48 గంటలపాటు వర్షాలు = 12వతేదీ వరకు ప్రభావం = రైతుల్లో ఆందోళన మచిలీపట్నం/ కోడూరు, న్యూస్‌లైన్ : వాయవ్య బంగాళాఖతంలో ఏర్పడిన ‘మాది’ తుపాను బలపడి మరో 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘవృతమై చల్లని గాలులు వీయడంతో ఏప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని రైతులు హడలిపోతున్నారు. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకు500 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను మన భూభాగం వద్ద తీరం దాటే అవకాశం లేకున్నా.... దీని ప్రభావంతో కోస్తా తీరంలో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం జిల్లాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. చిరుజల్లులతో బెంబేలు ... తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమైఉంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడ్డాయి. తుపాను ప్రభావం 12వ తేదీ వరకు ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో రైతులు బెంబేతెత్తిపోతున్నారు. వరికోతలు ఊపందుకున్న నేపథ్యంలో వర్షాలు కురిస్తే మరింతగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. గత నవంబరులో సంబవించిన లెహర్, హెలెన్ తుపానుల తాకిడికి అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి,బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, గుడివాడ, కైకలూరు, కలిదిండి తదితర మండలాల్లో దాదాపు 2.25 లక్షల ఎకరాల్లోవరి నేల వాలి నీటమునిగి పాడైపోయింది. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు లక్ష ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దాదాపు 70వేల ఎకరాల్లో వరిపంట పనలపై ఉంది. దాదాపు 5.34 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉంది. ఈతరుణంలో వర్షం కురిస్తే తమకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రైతులు భయపడిపోతున్నారు. ‘‘మాది’’ తుపాను ప్రభావంతో మరిన్ని వర్షాలు కురిస్తే వరిసాగు చేసిన రైతులు పంటపై ఆశ వదులుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో 'మడి' తుపాను..
-
బంగాళాఖాతంలో 'మడి' తుపాను..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. ఇది చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈ కొత్త తుపానుకు 'మడి' అనే పేరును మాల్దీవులు సూచించింది. ఇది ఉత్తరదిశగా పయనిస్తోంది. మడి తుఫాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మరో రెండు రోజుల పాటు ఇది ఉత్తరంగానే కదిలిన తర్వాత దీని పయనం ఈశాన్యదిశ వైపు మారొచ్చని అంటున్నారు. అయితే దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపానును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడ రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.