బంగాళాఖాతంలో ఏర్పడిన 'మాదీ' తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మాదీ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో సముద్రం 100 మీటర్లు ముందుకొచ్చింది. 30 పూరిళ్లు నేలమట్టం అయ్యాయి.
అలాగే, ఈ తుపాను ఒడిషా తీరంలోని గోపాల్పూర్ తీరానికి దక్షిణంగా 530 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఈశాన్యంగా 480 కిలోమీటర్ల దూరంలోను కేంద్రీకృతమైందని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది దక్షిణ నైరుతి దిశగా కదిలి, ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని వివరించింది.
బలహీనపడిన మాదీ తుపాను.. తూర్పుగోదావరిలో బీభత్సం
Published Wed, Dec 11 2013 12:16 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement