బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. ఇది చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈ కొత్త తుపానుకు 'మడి' అనే పేరును మాల్దీవులు సూచించింది. ఇది ఉత్తరదిశగా పయనిస్తోంది. మడి తుఫాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. మరో రెండు రోజుల పాటు ఇది ఉత్తరంగానే కదిలిన తర్వాత దీని పయనం ఈశాన్యదిశ వైపు మారొచ్చని అంటున్నారు. అయితే దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావం వల్ల ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపానును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడ రేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.
బంగాళాఖాతంలో 'మడి' తుపాను..
Published Sat, Dec 7 2013 12:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement