చెన్నైకి తూర్పుదిశగా.. కేంద్రీకృతమైన `మాదీ` తుపాను
విశాఖపట్నం: చెన్నైకి తూర్పుదిశగా 490కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను `మాదీ` కేంద్రీకృతమైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మాదీ తుపాను ఉత్తరదిశగా కదులుతున్నట్టు పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో బలహీనపడి.. తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రభావంతో గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో దక్షిణకోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలుకురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే అన్ని పోర్టుల్లో అధికారులు 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.