
తప్పిన వాయుగుండం ముప్పు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు తొలిగిపోయింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి విశాఖకు ఈశాన్యంగా 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.