మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతున్నా తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని రాష్ట్ర సమాచా ర, పౌరసంబంధాలశాఖ మంత్రి డీకే అరు ణ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రకట న చేసినందుకు మంగళవారం డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో సోనియాగాం ధీ కృతజ్ఞతలు తెలిపేందుకు అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటుపై సోనియాగాంధీ సీడబ్యూసీలో తీర్మానం చేయించడంతోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించడం గొప్పవిషయమన్నారు. రా ష్ట్రంలోని అన్ని పార్టీలతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన తర్వాతే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్న టీడీపీ, వైఎ స్సార్‌సీపీలు ఇప్పుడు యూటర్న్ తీసుకోవ డం బాధాకరమన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ దుకాణాలు బంద్ అవుతాయన్న ఉద్దేశంతోనే ఆయా పార్టీల నేతలు తెలంగాణ ప్రాంత మంత్రులను రాజీనా మా చేయాలని కోరడం అవివేకమన్నారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, ఉద్యమకారులు తమను ఎన్ని విధాల ఇబ్బందుల కు గురిచేసినా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ ఇస్తుందని, తెచ్చేది ఇచ్చేది తామేనని ప్రజల్లో విశ్వాసం కలిగించామన్నారు. తాను ఏనాడు ఉద్యమకారులపై కేసులు పెట్టమని ప్రోత్సహించలేదని, రా ష్ట్రం ఏర్పడిన తర్వాత కేసులను ఎత్తివేయించేందుకు కృషి చేస్తానన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు
తెలంగాణలోనే...
పార్లమెంట్‌లో బిల్లుపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, 2014 సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని మంత్రి ధీమా వ్య క్తం చేశారు. స్వార్థం కోసం సీమాం ధ్రులు, వివిధ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు ఆవేశానికి లోనుకావద్దని సూ చించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్ర జాప్రతినిధులు సహకరించాలని కోరారు. రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, పార్లమెంటులో బిల్లుపెట్టి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రా రంభించాలని ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ప్రతి పాదించిన తీర్మానాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
పముఖ జానపద గా యకుడు గోరెటి వెంకన్న ఆట, పాట సభి కులను అలరించింది. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పీఆర్‌టీ యూ,తెలంగాణ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ట్రంసా రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డి, వివిధ సంఘాల నాయకులు రామకృష్ణగౌడ్, శ్రీధర్‌గౌడ్, హన్మంతురావు, ఆడమ్స్, శ్రీనివాసరావు, షేక్ ఫారుఖ్‌హుస్సేన్ తదితరులు సోని యాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కె.జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అ బ్రహం, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీలు విఠల్‌రావు, మల్లురవి, మాజీ ఎమ్మెల్యేలు రాం మోహన్‌రెడ్డి, వంశీకృష్ణ, చిత్తరంజన్‌దాస్, విద్యుత్ ఎస్‌ఈ సదాశివారెడ్డి పాల్గొన్నారు.
‘అమ్మ’కు అభివందనం
Published Wed, Aug 28 2013 3:02 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement