
బాబుకు డీఎల్ వర్గీయుల ఝలక్
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప జిల్లాలోని డీఎల్ వర్గీయలు శనివారం ఝలక్ ఇచ్చారు. ఆదివారం కడప జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో డీఎల్కు సమాచారం ఇవ్వలేదు. దాంతో తమ నాయకుడికి సమాచారం ఇవ్వలేదని ఆయన వర్గీయులు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో జిల్లాలోని ఎంపీపీ సుమలతతోపాటు ఏడుగురు ఎంపీటీసీలు రాజీనామా చేశారు. అయితే రెండు రోజుల క్రితమే టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణయ్య ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.