!['విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41432306810_625x300.jpg.webp?itok=P3TIVI26)
'విదేశీ పర్యటనలకే ప్రధాని ప్రాధాన్యత'
తిరుమల: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వదిలి విదేశీ పర్యటనలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత దానం నాగేందర్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
మోడీ నుంచి ప్రజలు ఎంతో ఆశీంచారని, కానీ ఆయన అనుకున్న విధంగా ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించారన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల అధిక ధరలు పెరిగిపోయాయన్నారు. దీనివల్ల సామన్య ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.