దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఏలూరి సాంబశివరావు
సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రచార పర్వం ముగిసింది. తమకు నచ్చిన నేతను ఓటరు ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు వేయబోయే ముందు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థులు, వారి గుణగణాలపై ఓటర్లు చర్చించుకుంటున్నారు. గతంలో వారు చేసిన పనులు, సాయం కోసం వెళితే వారు స్పందించే తీరును బేరీజు వేసుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉండి వెన్నుదన్నుగా నిలిచే నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుల గుణగణాలు, వ్యవహారశైలిపై ప్రజలు చెప్తున్న విషయాలు ఈవిధంగా ఉన్నాయి.
ప్రజలతో దగ్గుబాటి మమేకం
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావుది సున్నిత మనస్తత్వం. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు చలించిపోతుంటారు. మొదటి నుంచి వారిది సంపన్న కుటుంబం. సాటివారి కష్టసుఖాలు పంచుకుంటూ గ్రామానికి పెద్దదిక్కువగా వ్యవహిరించేవారు. దీంతో అనేక మంది ఆయన వద్దకు వచ్చి సాయం పొందుతుండేవారు. ఆయన కూడా ప్రజల నాడిని ఎరిగిన వ్యక్తిగా వారికి ఏమి కావాలో అర్థం చేసుకుంటూ వారి అవసరాలకు అనుగుణంగానే మసులుకునేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీ అందుబాటులో ఉంటారు. తలుపుతట్టి సాయమడిగితే కాదనలేని వ్యక్తిత్వం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అనేక మందికి ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. అధికారంలో లేకున్నా ఆయనను కలవడానికి ఎంతో మంది దగ్గుబాటి కుటీరానికి వస్తుంటారు. ఆయనను నమ్మిన నాయకులు, కార్యకర్తలు ఎవరైనా వెన్నంటే ఉంటారు.
ఏలూరికి కలసిరాని సన్నిహితులు
వ్యాపారవేత్తగా ఉన్న ఏలూరి సాంబశివరావు ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ముందు గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టి ఆకర్షించారు. 2014 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అధికారంలోకి వచ్చాక పార్టీకి మొదటి నుంచి ఎన్నుదన్నుగా ఉన్న వాళ్లను దూరంగా ఉంచారు. తన అనుకున్న వారిని మాత్రమే దగ్గరకుతీశారు. మొదట్లో సేవే నా ప్రాణమన్న వ్యక్తి.. ఆ తరువాత ఏ పని చేయడానికైనా అలోచించడం మొదలుపెట్టేవారు.
ఏలూరితో కలిసి పనిచేయలేక అనేక మంది సీనియర్లు ఆయనను వీడి వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన సొంత మనుష్యల కంటే బైట వారినే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ప్రజల అభిప్రాయం.
దగ్గుబాటి నైజం..
♦ సాదాసీదాగా ఉంటారు.
♦ దేనికీ ప్రచారానికి ఇష్టపడరు.
♦ సాయం చేయడంలో ముందు వెనుకా ఆలోచించరు.
♦ ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కోపపడటం, గట్టిగా మాట్లాడటం ఉండదు.
♦ తన మనసుకు నచ్చింది చేస్తారు. మిగతా వాళ్లుకు పరిస్థితి వివరించి వారితోనూ చేయించుకుంటారు.
♦ ముక్కుసూటి మనిషి చేయగలిగింది చేస్తానని చెప్తారు.
♦ నచ్చకుంటే వారికి ఎడంగా ఉంటారు.
♦ ఏదైనా విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయరు.
♦ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం
ఏలూరి తీరు..
♦ ఆర్భాటాలకు పోతారు.
♦ పబ్లిసిటీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
♦ నమ్మిన వారికి మాత్రమే సాయం చేస్తారు.
♦ కోపం వచ్చినా తొందరగా బయటపడరు.
♦ ఏ నిర్ణయమైనా సొంతంగానే తీసుకుంటారు.
♦ నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడ్డా కొమ్ముకాస్తారు.
♦ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తారు.
♦ సహకరించని వారిని ఎడంగా పెడతారు.
♦ ఏదైనా ముఖ్య కార్యక్రమాలప్పుడే అందుబాటులో ఉంటారు.
♦ ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment