Eluri Samba Siva Rao
-
టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, బాపట్ల: టీడీపీ ఎన్నికల అక్రమాలపై పోలీసు శాఖ కొరఢా ఝళిపించింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం తదితర అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో కేసు నమోదు చేసింది. ఏ1గా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు ఆయన చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ నెల 24న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీలో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన అక్రమాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అనుమతించాలని పోలీసులు పర్చూరు మున్సిప్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల వినతిని పరిశీలించిన కోర్టు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారించేందుకు సోమవారం అనుమతి ఇచ్చింది. దాంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 123 (1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్ విత్ 120(బి), సీఆర్పీసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరితోపాటు పరారీలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు, ఆ కంపెనీకి చెందిన మరో ముగ్గురు ఉద్యోగులు, మరికొందరిని నిందితులుగా చేర్చారు. డీఆర్ఐ సోదాల్లో బయటపడిన అక్రమాలు జీఎస్టీ ఎగవేతను గుర్తించేందుకు గుంటూరులో ఉన్న ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు ఈనెల 24న సోదాలు నిర్వహించడంతో ఆయన పాల్పడ్డ ఎన్నికల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కార్యాలయంలో లభించిన ఓ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తెప్పించడం.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించడం.. అందుకోసం ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేసిన నగదు వివరాలు అన్నీ పోలింగ్ బూత్‌లవారీగా నమోదు చేసి ఉన్నాయి. ఆ మేరకు ఖర్చు చేసిన నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే వివరాలు ఏవీ కంపెనీ రికార్డుల్లో లేవు. అంటే షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా నిధులు తరలించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టమైంది. దాంతో డీఆర్ఐ అధికారులు ఈ అంశాన్ని ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ ప్రధాన కార్యాలయాలకు నివేదించారు. ఎన్నికల అక్రమాలపై బాపట్ల పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి, తదితరులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు బాపట్ల న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజాస్వామ్యవాదుల హర్షం గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఏలూరిపై కేసు నమోదు కావడం పర్చూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేపై కేసు నమోదుకావడం పట్ల ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరిని పోలీసులు విచారించే క్రమంలో అవసరమైతే ఆయనను అరెస్ట్‌చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలి నుంచీ అక్రమాలే.. నోవా అగ్రిటెక్ స్థాపించినప్పటి నుంచి ఏలూరి సాంబశివరావు అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కంపెనీ తయారు చేసే నాసిరకం బయో మందులతో రైతులకు నష్టాలు మిగిలాయన్న ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఆ మందులను పెద్ద ఎత్తున విక్రయించి ఎమ్మెల్యే సొమ్ము చేసుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయలు ఏలూరి దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు–చెట్టు కింద చెరువులు తవ్వాలని ఏలూరి పట్టుబట్టారు. దీనిని దళితులు వ్యతిరేకించారు. దళితులు– ఏలూరికి మధ్య గొడవ అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. మార్టూరు మండలంలో 250కి పైగా గ్రానైట్ పరిశ్రమలు ఉండగా ఇందులో 90 శాతం మంది యజమానులు ఒకే సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే బయటకు తరలిపోతుంది. ఇందుకు ఎమ్మెల్యే ఏలూరి సహకరిస్తుండటంతో ఆయనకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది. మరోపక్క ఎన్ఆర్ఐలు పంపించే నల్లధనాన్ని సైతం ఏలూరి ఎన్నికల అక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి 15 వేలకుపైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇటీవల సదరు దొంగ ఓట్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. డైరీ వెల్లడించిన ఎన్నికల అక్రమాలు.. ► పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ► మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ. 3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ. ► నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ. ► ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ. 15 లక్షలు పంపిణీ. ► పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ► ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. పర్చూరు ఎన్నికల అక్రమాల నిందితులు.. ఏ1: ఏలూరి సాంబశివరావు, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏ2: పుల్లెల అజయ్ బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ3: అప్పారావు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ4: బాజి బాబు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ5: సాయి గణేశ్, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగి ఏ6: ఇతరులు అక్రమాలపై లోతుగా విచారిస్తాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోవా అగ్రిటెక్ అక్రమాల వ్యవహారాన్ని లోతుగా విచారించాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు కంపెనీ ఉద్యోగులను విచారించాలి. ఇందుకోసం వారిపై కేసులు నమోదు చేశాం. ఈ మేరకు పర్చూరు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి తీసుకొని సోమవారం ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశాం. – వకుల్ జింధాల్, ఎస్పీ, బాపట్ల జిల్లా. -
తీగ లాగితే.. టీడీపీ కదిలింది
సాక్షి, అమరావతి: నల్లధనం తీగ లాగితే టీడీపీ డొంక కదిలింది! పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘నోవా అగ్రిటెక్’ జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు నిర్వహిస్తే ఆ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం బాగోతం బట్టబయలైంది. గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ భారీ ఆర్థిక అక్రమాలకు అడ్డాగా మారిందని రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తనిఖీల్లో వెల్లడైంది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో నిగ్గు తేలింది. విచారణకు సహకరించకుండా మొండికేస్తున్న నోవా అగ్రిటెక్‌కు డీఆర్ఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు బాపట్ల పోలీసులు సిద్ధమయ్యారు. లెక్కా పత్రాలు లేవు.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆయా రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు విస్తుపోయారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి నోవా కార్యాలయంలో ఒక్క రికార్డు కూడా లేదు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు, రశీదులు, ఇన్వాయిస్లు, బ్యాంకు లావాదేవీలు, ఇతర వివరాలేవీ లేవు. దీంతో అసలు ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో మాత్రం చాలా మంది పేర్లు ఉండగా వారిలో సగం మంది ఉద్యోగులు కూడా కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. జీఎస్టీకి సంబంధించిన పత్రాలేవీ రికార్డుల్లో లభించ లేదు. దీంతో నోవా అగ్రిటెక్ కంపెనీకి నోటీసులు జారీ చేసి బాధ్యులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ డీఆర్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నల్లధనం కేరాఫ్ ‘నోవా’ నోవా అగ్రిటెక్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా లభ్యమైన ఓ డైరీ ఎన్నికల్లో టీడీపీ నేతల నల్లధనం పంపిణీ గుట్టును రట్టు చేసింది. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో అందులో సవివరంగా ఉంది. నల్లధనం వెదజల్లి ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి వివరాలన్నీ అందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం నోవా కంపెనీని నెలకొల్పినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుకాయించారు. కంపెనీ పేరిట భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ కార్యాలయం నుంచి వ్యాపార కార్యకలాపాలు కాకుండా నల్లధనం చలామణి సాగిస్తున్నట్లు డైరీతో పాటు అక్కడ లభ్యమైన మరికొన్ని కీలక ఆధారాలు వెల్లడించాయి. అందుకోసమే కంపెనీ బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నోవాకు నగదు ఏ ఖాతాల నుంచి వస్తోంది? ఆదాయ వనరులు ఏమిటి? అనే వివరాలపై కంపెనీ ఉద్యోగులు మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించాలని కోరుతూ కేంద్ర ఆదాయపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, స్టాక్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)లకు డీఆర్ఐ అధికారులు నివేదించారు. నోవా యాజమాన్యం, ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ పోలీసుశాఖ బాపట్ల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అనంతరం ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇతరులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. -
కుటుంబ వివాదాలను రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే
సాక్షి, చినగంజాం (ప్రకాశం): కుటుంబ వివాదాలను టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాజకీయం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ దళిత బహుజన మహాసభ జిల్లా అధ్యక్షుడు అల్లడి శ్యాంబాబు అన్నారు. ఆదివారం చినగంజాంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ దళిత బహుజన మహాసభ తరపునఎమ్మెల్యే చర్యలను ఖండించారు. నిన్నమొన్నటి వరకు కూలాల మధ్య చిచ్చు రగిల్చి, దళిత బహుజనులను విడదీసి వివాదాలను పెంచి పోషించారని విమర్శించారు. రాజకీయ అధికారంతో గ్రామాల్లో దళిత భూములను అన్యాక్రాంతంగా తన తాబేదార్లకు కట్టబెట్టి దళిత, దళారీలను ప్రోత్సహిస్తూ దళితులకు టీడీపీఎమ్మెల్యే ఏలూరి అన్యాయం చేసారని ఆరోపించారు. ప్రస్తుతం కుటుంబ కలహాలను కూడా రాజకీయం చేసి గ్రామాల్లో వివాదాలను పెంచి విద్వేషాలను రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ధ్వజమెత్తారు. రుద్రమాంబపురం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య చాలాకాలంగా తగాదాలు జరుగుతూ వారి మధ్య వైరం పతాక స్థాయికి చేరుకొని కుటుంబంలోని ఒక మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు పొగొట్టుకుని వారి కుటుంబం శోకమయమై అల్లాడుతుంటే ఆ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఆ గ్రామాల్లోని టీడీపీ నాయకులు అమాయకులైన మహిళలను కేసుల్లో ఇరికించి వారిని వేధింపులకు గురిచేస్తూ వారికి శిక్షలు వేయించేం దుకు పోరాడటం సమంజసం కాదన్నారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నాయకులపై అనవసరంగా బురద చల్లడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ మహ్మద్ షా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
దగ్గుబాటి అందరికీ.. ఏలూరి కొందరికే సాయం
సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రచార పర్వం ముగిసింది. తమకు నచ్చిన నేతను ఓటరు ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు వేయబోయే ముందు ప్రధాన పార్టీల మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థులు, వారి గుణగణాలపై ఓటర్లు చర్చించుకుంటున్నారు. గతంలో వారు చేసిన పనులు, సాయం కోసం వెళితే వారు స్పందించే తీరును బేరీజు వేసుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉండి వెన్నుదన్నుగా నిలిచే నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుల గుణగణాలు, వ్యవహారశైలిపై ప్రజలు చెప్తున్న విషయాలు ఈవిధంగా ఉన్నాయి. ప్రజలతో దగ్గుబాటి మమేకం మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావుది సున్నిత మనస్తత్వం. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు చలించిపోతుంటారు. మొదటి నుంచి వారిది సంపన్న కుటుంబం. సాటివారి కష్టసుఖాలు పంచుకుంటూ గ్రామానికి పెద్దదిక్కువగా వ్యవహిరించేవారు. దీంతో అనేక మంది ఆయన వద్దకు వచ్చి సాయం పొందుతుండేవారు. ఆయన కూడా ప్రజల నాడిని ఎరిగిన వ్యక్తిగా వారికి ఏమి కావాలో అర్థం చేసుకుంటూ వారి అవసరాలకు అనుగుణంగానే మసులుకునేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా అందరికీ అందుబాటులో ఉంటారు. తలుపుతట్టి సాయమడిగితే కాదనలేని వ్యక్తిత్వం. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అనేక మందికి ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజం. అధికారంలో లేకున్నా ఆయనను కలవడానికి ఎంతో మంది దగ్గుబాటి కుటీరానికి వస్తుంటారు. ఆయనను నమ్మిన నాయకులు, కార్యకర్తలు ఎవరైనా వెన్నంటే ఉంటారు. ఏలూరికి కలసిరాని సన్నిహితులు వ్యాపారవేత్తగా ఉన్న ఏలూరి సాంబశివరావు ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి ముందు గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టి ఆకర్షించారు. 2014 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అధికారంలోకి వచ్చాక పార్టీకి మొదటి నుంచి ఎన్నుదన్నుగా ఉన్న వాళ్లను దూరంగా ఉంచారు. తన అనుకున్న వారిని మాత్రమే దగ్గరకుతీశారు. మొదట్లో సేవే నా ప్రాణమన్న వ్యక్తి.. ఆ తరువాత ఏ పని చేయడానికైనా అలోచించడం మొదలుపెట్టేవారు. ఏలూరితో కలిసి పనిచేయలేక అనేక మంది సీనియర్లు ఆయనను వీడి వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన సొంత మనుష్యల కంటే బైట వారినే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ప్రజల అభిప్రాయం. దగ్గుబాటి నైజం.. ♦ సాదాసీదాగా ఉంటారు. ♦ దేనికీ ప్రచారానికి ఇష్టపడరు. ♦ సాయం చేయడంలో ముందు వెనుకా ఆలోచించరు. ♦ ఎదుటివారి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. కోపపడటం, గట్టిగా మాట్లాడటం ఉండదు. ♦ తన మనసుకు నచ్చింది చేస్తారు. మిగతా వాళ్లుకు పరిస్థితి వివరించి వారితోనూ చేయించుకుంటారు. ♦ ముక్కుసూటి మనిషి చేయగలిగింది చేస్తానని చెప్తారు. ♦ నచ్చకుంటే వారికి ఎడంగా ఉంటారు. ♦ ఏదైనా విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయరు. ♦ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఏలూరి తీరు.. ♦ ఆర్భాటాలకు పోతారు. ♦ పబ్లిసిటీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ♦ నమ్మిన వారికి మాత్రమే సాయం చేస్తారు. ♦ కోపం వచ్చినా తొందరగా బయటపడరు. ♦ ఏ నిర్ణయమైనా సొంతంగానే తీసుకుంటారు. ♦ నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడ్డా కొమ్ముకాస్తారు. ♦ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తారు. ♦ సహకరించని వారిని ఎడంగా పెడతారు. ♦ ఏదైనా ముఖ్య కార్యక్రమాలప్పుడే అందుబాటులో ఉంటారు. ♦ ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. -
ఎన్నికలొస్తున్నాయ్.. త్వరగా పని కానిచ్చేయండి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఎన్నికల నొటిఫికేషన్‌కు సమయం ఆసన్నం కావడంతో అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనుల జోలికి వెళ్లని చంద్రబాబు సర్కారు ఎన్నికల వేళ వేల కోట్ల రూపాయల పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తోంది. గతంలో శంకుస్థాపనలు చేసిన పనులను పట్టించుకోని ప్రభుత్వం నేడో రేపో ఎన్నికలనగా అన్ని చేసేస్తామంటూ జనాన్ని మభ్యపెట్టే యత్నానికి దిగారు. మార్చి నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల పనులకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేశారు. ఇది చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేందుకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఫలకాల జోరు.. ఒంగోలు నగర పరిధిలో రెండో డివిజన్ కేశవరాజుగుంటలో పోతురాజు కాలువ నుంచి న్యూ హైవే వరకు రూ.2.58 కోట్లతో రోడ్డు విస్తరణ పనులంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు రెండు రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోడ్డు అభివృద్ధి పనులు ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనకే తెలియాలి. రెండో డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు న్యూహైవే నుంచి ముదిగొండవాగు వరకు మరో రూ.1.07 కోట్లతో రోడ్డు పనులకు సైతం శంకుస్థాపనలు చేశారు. భాగ్యనగర్ 4వ లైను పదో అడ్డరోడ్డులో రూ.2 కోట్లతో కాపు సంక్షేమ భవన్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.22.40 కోట్లతో కరువది నుంచి గుండాయపాలెం, కరవది నుంచి కొప్పోలు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. 24వ డివిజన్ సమైఖ్య నగర్లో రూ.30 లక్షలతో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. వెంగముక్కల పాలెంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేయగా వెంగముక్కలపాలెం జంక్షన్ నుంచి భగీరధ కెమికల్ ఫ్యాక్టరీ వరకు రూ.3 కోట్లతో నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొత్తం పనులకు మార్చి 5, 6, 7 తేదీల్లో శంకుస్థాపనలు చేయడం గమనార్హం. ఐదేళ్లపాటు వీటి జోలికి వెళ్లని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనల తంతు చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనిగిరిలోనూ ఇదే తీరు.. కనిగిరిలోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల శంకుస్థాపనల జోరు సాగిస్తున్నారు. కనిగిరిలో రూ.189 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కనిగిరి తాగునీటి సమస్య ఎమ్మెల్యేకు ఐదేళ్ల పాలనా కాలం చివరిలో గుర్తుకు రావడం గమనార్హం. సీఎస్‌పురం మండలంలో ఆర్అండ్బీ నుంచి బోడావులదిన్నె వరకు రూ.43.93 లక్షలతో తారు రోడ్డు పనికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలోనూ పెదరాజుపాలెం నుంచి ఎగువపల్లివరకు రూ.1.35 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా కోనపల్లి నుంచి బోయమడుగులకు రూ.63 లక్షలతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. డీజీ పేట నుంచి బొంతువారిపల్లి వరకు రూ.3.60 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇదే మండలంలో పలు సీసీ రోడ్లు నిర్మాణాలకు సైతం గత రెండు మూడు రోజుల క్రితం శంకుస్థాపనలు చేశారు. ఇదే మండలంలో బీసీ వసతి గృహ భవన నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి సైతం హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఆ భవనం నిర్మాణానికి నోచుకోక పోవడం గమనార్హం. పామూరు మండలంలో కంభాలదిన్నె నుంచి రేణుమడుగు వరకు రూ.4.29 కోట్లతో తారు రోడ్డు పనికి ఇటీవలే శంఖుస్థాపన చేయగా రూ.2.72 కోట్లుతో రజాసాహెబ్‌పేట తారు రోడ్డు పనికి, బోడవాడ నుండి అక్కంపేట వరకు రూ.3.05 కోట్లతో తారు రోడ్డు పనికి రూ.1.74 కోట్లతో రేగుచెట్లపల్లి తారు రోడ్డుకు ఎమ్మెల్యే ఇటీవలే శంకుస్థాపన చేశారు. • అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రూ.85 కోట్లతో గుండ్లకమ్మ నుంచి అద్దంకి పట్టణానికి నీరందించే పథకానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు. • దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో మొగలిగుండాల రిజర్వాయర్‌కు మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవలే శంకుస్థాపన చేశారు. దొనకొండ మండలంలోని వెంకటాపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, రాగమక్కపల్లిలో చిన్న తరహా పరిశ్రమలకు, దర్శిలో 1000 జీప్లస్2 గృహాలకు ఇటీవల మంత్రి శంఖుస్థాపనలు చేశారు. ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోని అధికార పార్టీ ఎన్నికల సమయంలో శంకుస్థాపనలకు దిగడంపై విమర్శలు ఉన్నాయి. • గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం అనుమలపల్లిలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి 132/32 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. రెండు నెలలుగా ఈ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు మొదలయ్యాయి. గురువారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేయడం గమనార్హం. • పర్చూరు నియోజకవర్గంలో మార్చి 4న కారంచేడులో రూ.3.80 కోట్లతో మంచినీటి పథకానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంఖుస్థాపన చేశారు. ఫిబ్రవరి 25న రూ.11.45 కోట్లతో యద్దనపూడి మండలంలోని సూరవరపుపల్లి, అనంతవరం, వింజనం పాడు, చిలుకూరివారిపాలెం, యద్దనపూడి, వెన్నవరం గ్రామాల్లో కమ్యూనిటీహాళ్లు, పంచాయతీ భవనాలకు, సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. తొండివాగుపై బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేశారు. ఇంకొల్లులో రూ.40 లక్షలతో అన్నా క్యాంటీన్ కోసం ఇటీవలే శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంకొల్లు చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ కోసం రూ.50 లక్షల పనికి శంకుస్థాపన చేశారు. • కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ వద్ద రూరల్ మండలంలో తాగునీటి సరఫరా కోసం నీటి పథకానికి ఎమ్మెల్యే పోతుల రామారావు శంఖుస్థాపన చేశారు. అలాగే రూ.37 లక్షలతో కందుకూరు పట్టణంలో డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో షాదీఖాన కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అధికార పార్టీ హడావుడిపై విమర్శలు.. వాస్తవానికి గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను గాలికి వదిలేసింది. కనిగిరి నిమ్జ్. దొనకొండ పారిశ్రామికవాడలకు ఎప్పుడో శంకుస్థాపనల శిలాఫలకాలు వేశారు. ఇప్పటికి వాటి ఊసులేదు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామన్నారు. ఐదేళ్లుగా ఈ హామీ నెరవేరలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టును దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేయగా మిగిలి ఉన్న 5శాతం పనులను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మూడేళ్ల క్రితం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరైనా ఇప్పటికి కనీసం భవనాలు ఏర్పాటు చేసి జిల్లాలో ట్రిపుల్ ఐటీని నడపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బాబు సర్కారు ఉండి పోయింది. పాత హామీలను పక్కన పెడితే ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం పోర్టు, ఏషియన్ పేపర్ పరిశ్రమలు నిర్మిస్తామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఊసేలేదు. అవన్నీ పక్కనపెట్టి తీరా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హడావిడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘దేశం’లో నైరాశ్యం!
సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ పరిస్థితి జిల్లాలో నానాటికీ దిగజారుతోంది. రాజకీయ సమీకరణలు రోజుకోరకంగా మారుతున్నాయి. సామాజికవర్గ మొగ్గులపై దిగ్గజాలు సైతం విస్మయం చెందుతున్నారు. నిన్నటిదాకా గెలుపు ఓకే.. మెజార్టీ కోసమే పని చేస్తున్నామంటూ చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు.. తాజాగా ప్రత్యక్ష అనుభవాలను చవిచూస్తున్నారు. దీంతో వారి అంచనాలు తారుమారవుతున్నాయి. జిల్లా మొత్తం 12 నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు చోట్ల తమపార్టీ గెలుపు ఖాయమని టీడీపీ ప్రచారం చేసుకుంది. అధినేత చంద్రబాబు జిల్లాకొచ్చినప్పుడు ఇదేవిషయాన్ని నివేదిక రూపంలో పార్టీ పేర్కొంది. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో నియోజకవర్గాల్లో సామాజికవర్గ చీలికలు అనూహ్యంగా తెరమీదకొచ్చాయి. రెండ్రోజుల కిందట చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ పరిస్థితి తెలుసుకుని అవాక్కయ్యారు. ఊహించని రీతిగా కొన్ని సామాజికవర్గాలు పార్టీని వీడిపోవడంపై చర్చించినట్లు పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. అద్దంకి, పర్చూరు, కనిగిరి, దర్శి, చీరాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురుగాలి వీస్తోండటంతో స్వపక్షీయులే డైలమాలో పడ్డారు. బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పోటీచేయడం అభ్యర్థుల సీట్ల కేటాయింపులో నిర్ణయ లోపాలు అభ్యర్థుల సమన్వయలేమి తదితర కారణాల నేపథ్యంలో పార్టీ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీలో గుర్తింపు లేదంటున్న బీసీలు.. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి బీసీ వర్గం పార్టీకి వెన్నెముకగా నిలిచింది. అలాంటిది, ప్రస్తుతం చంద్రబాబు వారిని దూరంగా పెడుతూ పార్టీని చేతులారా నాశనం చేస్తున్నారని నేతలు మదనపడుతున్నారు. ఎన్నికల్లో బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై దుమారం రేగుతోంది. ప్రధానంగా యాదవ , రజక, పద్మశాలి ఓటింగ్ ఇప్పటికే టీడీపీని వీడి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ సీపీని ఎంచుకుంది. కనిగిరి, అద్దంకి, దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఆయా వర్గాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ అసంతృప్తిని వెళ్లగక్కి.. పార్టీ మారుతున్నారు. అన్నిచోట్లా ఆత్మీయ సమావేశాలతో వైఎస్సార్ సీపీ నేతలను ఆహ్వానించి వారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. పైగా, ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి బీసీలకు చంద్రబాబు మొండిచేయిచ్చారు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ మాత్రం జిల్లాలో కనిగిరి సీటును బీసీ (యాదవ) అభ్యర్థి బుర్రా మధుసూద న్యాదవ్కు కేటాయించింది. స్థానిక ఎన్నికల్లో జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ కూడా ఓసీ జనరల్ అయినప్పటికీ, వైఎస్సార్ సీపీ మాత్రం బీసీ(యాదవ)కి చెందిన డాక్టర్ నూకసాని బాలాజీని బరిలో నిలిపి ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పించింది. =కందుకూరు, చీరాల, కనిగిరి, అద్దంకి, పర్చూరు, గిద్దలూరు, ఒంగోలు తదితర నియోజకవర్గాల్లో అధికంగా వున్న బీసీల తీర్పు ఈఎన్నికల్లో కీలకం కానుంది. వైఎస్సార్ సీపీకి మద్దతిస్తామని. టీడీపీ ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయం వీరి నుంచి వినిపిస్తోంది. ఓటమిపై లెక్కలేస్తున్న పరిశీలకులు.. సామాజికవర్గ ఓటింగ్ చీలికతో టీడీపీ ఓటమి అన్నిచోట్లా ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనాలేస్తున్నారు. కనిగిరి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుకు ఓటమి తప్పదనే లెక్కలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆయన సామాజికవర్గ ఓటింగ్ తక్కువగా ఉంది. బీజేపీ, టీడీపీ పొత్తుతో ముస్లిం మైనార్టీలు దూరమయ్యారు. వైఎస్సార్ సీపీ యాదవ సామాజికవర్గ నేతకు సీటివ్వడంతో.. అక్కడ సుమారు 35 వేల పైచిలుకు ఉన్న యాదవ ఓటింగ్ మొత్తం టీడీపీని వీడిపోవడం ‘కదిరి’కి మైనస్ అయ్యింది. మరోవైపు స్వపక్షంలో ఇరిగినేని తిరుపతినాయుడు వర్గంతో కొనసాగుతోన్న ఆధిపత్యపోరు కూడా అతని మైనస్ కానుంది. ఇదే వాతావరణం దర్శి నియోజకవర్గ ంలో కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దర్శి ఓటింగ్ మొత్తం 1.98 లక్షలు కాగా, అందులో బీసీ సామాజికవర్గం 20 వేలు, కాపులు 19 వేల ఓటర్లుండగా.. వారంతా పూర్తిగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు టీడీపీ వరుసగా 20 ఏళ్లుగా తగిన ప్రాధాన్యతనివ్వకుండా.. అవమానపరుస్తూనే ఉంది. దీన్ని కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు వ్యవహార శైలిపై ఇప్పటికే నారపుశెట్టి వర్గం అసమ్మతితో కుతకుతలాడుతోంది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన పక్కన తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. మెజార్టీ కాపులు బూచేపల్లి వైపే మొగ్గుచూపుతున్నారని ఆ వర్గ పెద్దలు చెబుతున్నారు. అద్దంకిలో కరణం వెంకటేష్‌కు టీడీపీ సీటివ్వడంతో బీసీ, వైశ్య, కాపు సామాజికవర్గాలన్నీ పార్టీకి దూరమయ్యాయి. అతను కిందటి జనవరిలో అద్దంకి నడిబజారులో ప్రత్యర్థులపై దాడులకు తెగబడటం ఇప్పుడు అతనికి చాలా మైనస్ అవుతోందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. అక్కడ ఓటింగ్ మొత్తం 2.20 లక్షల పైచిలుకుంటే.. కమ్మ సామాజికవర్గంలో భారీ చీలికతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గెలుపు మెజార్టీ పెరుగుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీని కాదని.. వైఎస్సార్ సీపీలోకి చేరడం జిల్లాలోని మరిన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోంది. చీరాలలో పోతుల సునీతను స్థానికేతరురాలిగా భావిస్తున్నందున.. ఆమె కుటుంబ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని బీసీ, వైశ్య, కాపు సామాజికవర్గాలు అటువైపు మొగ్గుచూపడం లేదని టీడీపీ ద్వితీయశ్రేణి వర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. పర్చూరులో సైతం ఏలూరి సాంబశివరావు నిన్నటిదాకా విపరీతంగా డబ్బుఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నప్పటికీ.. తాజాగా సొంత సామాజికవర్గ పెద్దలే ఆయన్ను కాదంటున్నారు. అక్కడ గొట్టిపాటి భరత్ కుటుంబంపై సానుభూతి పనిచేయడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చిన అంశమైంది.